మేడారం భక్తులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27:  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌భక్తులందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ’వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను కొలుస్తూ భక్తులు ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే జాతర ఈ జాతర అని కొనియాడారు. సమ్మక్క సారలమ్మల పోరాట స్ఫూర్తికి, త్యాగనిరతికి ప్రతీక ఈ సమ్మక్క సారలమ్మ మహా జాతర అని తెలియజేశారు. తెలంగాణతోపాటు దేశంలోని ఇతర రాష్టాల్ర నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే ’తెలంగాణ కుంభమేళా’ మేడారం జాతర అని కేటీఆర్‌ అభివర్ణించారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *