రాజలింగమూర్తి హత్యలో  కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు హస్తం

ఈ కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారిస్తాం
హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌
‌మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి20: సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. దీని వెనక కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీష్‌ ఉన్నారని ఆరోపించారు. ‘మీరు తెలంగాణలో ఎలా పుట్టారో అర్థం కావడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు హత్యా రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.

దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారని తెలిపారు. సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యను ఖండిస్తున్నాను’’ అని అన్నారు. మేడిగడ్డ అక్రమాలపై రాజలింగమూర్తి కోర్టులో పోరాడుతున్నాడని తెలిపారు.  నీళ్లు పోసుకుని పెట్రోల్‌ అని చెప్పి అమాయకులు చనిపోవడానికి హరీష్‌ ‌కారణమయ్యారని దుయ్యబట్టారు. దోపిడీ బయట పడుతుందని హత్యలు చేస్తారా అంటూ ఫైర్‌ అయ్యారు. అడ్వకేట్‌ ‌వామన రావును హత్య చేసిన వాళ్లకే కేసీఆర్‌ ‌టికెట్‌ ఇచ్చారన్నారు. హరీష్‌ ‌రావు మానవత్వం ఉన్న మనిషేనా అని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యను డైవర్ట్ ‌చేసేందుకు హరీష్‌ ‌రావు కృష్ణా నీళ్ల గురించి మాట్లాతున్నారన్నారు.

‘‘స్కాముల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా? 15 నెలల నుండి కేసీఆర్‌ ఈ ఎవరికైనా కనిపించాడా? కాంగ్రెస్‌ ‌గ్రాఫ్‌ ‌తగ్గిందని కేసీఆర్‌కు ఎలా తెలుసు? ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా భట్టి ఒంటరి పోరాటం చేశారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జయశంకర్‌ ‌భూపాలపల్లి: మాజీ కౌన్సిలర్‌ ‌భర్త రాజలింగముర్తి హత్యను కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హత్యకు కారకులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page