ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్‌ను కాపాడా

– అయినా పక్కన పెడుతున్న పార్టీ
– మరోమారు అక్కసు వెళ్లగక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్‌

‌నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌17:‌మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు తన ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నుంచి వొచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, తనతోపాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్‌ ‌వెంకటస్వామికి మంత్రి పదవి, అతని కుమారుడికి ఎంపీ టికెట్‌ ఇచ్చారన్నారు. తనను మాత్రం పక్కన పెట్టారని మండిపడ్డారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను కాంగ్రెస్‌ ‌మోసం చేసిందన్నారు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఎక్సైజ్‌ ‌నిబంధనలకుతోడు నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత నిబంధనలు ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ కేవలం ప్రజలకు మేలు చేసేందుకే అని చెప్పారు. నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్‌, ‌నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్‌, ‌సంస్థాన్‌ ‌నారాయణపురం మండలాలలో వైన్‌ ‌షాప్స్ ‌టెండర్స్ ‌వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశారు. వైన్‌ ‌షాప్స్ ‌నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు. మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశారు. వైన్‌ ‌షాప్‌లు ఊరి బయట మాత్రమే పెట్టాలని, షాప్‌నకు అనుబంధంగా పర్మిట్‌ ‌రూమ్‌ ఉం‌డవద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ ‌షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ ‌షాప్‌ ‌లు దక్కించుకున్న ఓనర్స్ ‌సిండికేట్‌ ‌కాకూడదని పేర్కొన్నారు. ఈ రూల్స్ ‌ప్రభుత్వ ఎక్సైజ్‌ ‌పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్‌ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page