– ఆక్రమణ చెర నుంచి రక్షించిన హైడ్రా
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబరు 17: హైడ్రా మరో భూమికి విముక్తి కలిగించింది. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని గతంలో ప్రభుత్వం భావించింది. మరోవైపు అశోక్ సింగ్ అనే వ్యక్తి దీన్ని తన భూమిగా చెబుతున్నాడు. ఈక్రమంలో సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ భూమిలో ఇప్పటికే రెండు సార్లు రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. అయినా అశోక్ సింగ్ స్థలాన్ని ఖాలీ చేయడంలేదు. మరోవైపు ఖాలీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడ్డాడు. అశోక్ సింగ్‌పై లంగర్‌హౌస్, మంగళ్‌హాట్, శాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో 8కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో హైడ్రా అక్కడ కూల్చివేతలు చేపట్టి, భూమిని స్వాధీనం చేసుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





