క్షుద్ర రాజకీయాలు కాంగ్రెస్‌కే చెల్లు

– తెలంగాణ కోసం కొట్లాడిన మాకు తెలియదు
– నీటి వాటాల విషయంలో తేడా వస్తే తెలంగాణ భగ్గుమంటది
– నీళ్లు ఎత్తిపోయడం కూడా చేతకాని సిఎం రేవంత్‌ ‌రెడ్డి
– మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 8 : క్షుద్ర పూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం.. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్లం.. క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం తమకు లేదని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటామన్నారు. హరీష్‌ ‌రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా? కాంగ్రెస్‌ ‌పార్టీలాగా మేడిగడ్డకు, చెక్‌ ‌డ్యామ్‌లనూ ధ్వంసం చేసి వోట్లు దండుకోవాలని చూడలేదని ఆరోపించారు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్‌ ‌సంస్కృతి బీఆర్‌ఎస్‌ది కాదన్నారు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదు. ఏ సబ్‌ ‌స్టేషన్‌కైనా రావడానికి మేము సిద్ధం. 24 గంటల కరెంట్‌ ‌వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలి. కనీసం ఐదు, ఆరు సార్లు ప్రతిరోజూ కరెంట్‌ ‌కోతలు అవుతున్నాయని విమర్శించారు. కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్‌ ‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామిక వాదులు గుర్తించాలని కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ ‌రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలని, రేవంత్‌ ‌రెడ్డి హిట్లర్‌ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చామని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక ఒక్క పట్టా అయినా ఇవ్వలేదని, పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్‌ ‌లోని 10,000 ఎకరాల విలువైన భూమి పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్‌ ‌రెడ్డి చేస్తున్న 5 లక్షల కోట్ల స్కామ్‌ ‌పైన రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తామని కేటీఆర్‌ ‌వెల్లడించారు. హిల్ట్ ‌పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో ప్రజలందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్‌ ‌ల రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు. రైతులపై రేవంత్‌రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదని తెలిపారు. తాము డిమాండ్‌ ‌చేస్తేగానీ పంప్‌లు ఎందుకు ఆన్‌ ‌చేయలేదని ప్రశ్నించారు. సీఎంకు ఎప్పుడు నీళ్లు ఎత్తిపోయాలో కూడా తెలియదని విమర్శించారు. హరీశ్‌రావు ఈ విషయంపై ప్రశ్నించినా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సీఎం రేవంత్‌ ‌దృష్టిలో భూమి అంటే రియల్‌ ఎస్టేట్‌ అని ఎద్దేవా చేశారు.కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని  కేటీఆర్‌  ‌హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన వస్తుందని స్పష్టం చేశారు. వచ్చేవారం జరిగే జీఆర్‌ఎం‌బీ సమావేశం ఎజెండా ఎందుకు అంగీకరించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సమావేశం ఎజెండా పూర్తిగా రాష్ట్ర‌ హక్కులను కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌ని సలహాదారుగా పెట్టుకోవడమే ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. తెలంగాణలో ఒక్క ఇంజనీర్‌ ‌కూడా లేరా? చంద్రబాబు చెప్పు చేతల్లో రేవంత్‌ ‌రెడ్డి నడుస్తున్నాడు. రేవంత్‌ ‌రెడ్డికి సిగ్గుంటే ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌ని తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు. నార్లాపూర్‌ను ముట్టడించి పంపులను ఆన్‌ ‌చేస్తామన్నబీఆర్‌ఎస్‌ ‌హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చి పంపులని ఆన్‌ ‌చేసిందని వెల్లడించారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్‌ ‌రెడ్డికి పాలమూరు నీళ్లు ఇచ్చే సోయి లేదు. వర్షాలు పడి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తి పోసుకుంటే ముఖ్యమంత్రికి పట్టింపు లేదు. ప్రధాన ప్రతిపక్షం ముళ్లు తో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది లేదంటే నిద్రపోతున్నదని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *