హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజులుగా జలుబుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా అదే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్‌ను ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు. కాగా, ప్రతీ రెండు నెలలకు ఒకసారి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. గతంలో యశోదా ఆస్పత్రికి తరచుగా వెళ్తుండేవారు. అయితే ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
