– మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం
న్యూదిల్లీ, అక్టోబర్ 6: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వంద శాతం బీసీకే సీటు వస్తుందనే నమ్మకం తనకు ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలిచారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారన్నారు. ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి జూబ్లీహిల్స్ పదేళ్ల్లుగా దూరమైందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సానుభూతి పేరిట మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని రోడ్డు విూద పడేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. షెడ్యూల్ కూడా రావడంతో అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలోకి వెళతామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





