– విూరు పనులు వదిలి వెళితే మేం చేస్తున్నాం
– బకాయిలు పెట్టిన డబ్బులు చెల్లిస్తున్నాం
– హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం.. శంకుస్థాపన స్థాయిలో వదిలిన హాస్పిటల్స్‌ను ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. టిమ్స్, ఇతర హాస్పిటళ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతుండడంపై శనివారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. విూ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే తాము చెల్లిస్తున్నాం అని చెప్పారు. నిత్యం ఆర్ అండ్ బీ అధికారులతో సవిూక్ష నిర్వహిస్తున్నానని, రేయింబవళ్లు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పకొచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. విూలాగా మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం అని ఘాటుగా సమాధానమిచ్చారు. సనత్‌నగర్ టిమ్స్ అక్టోబర్ 31కి ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పాం.. అల్వాల్ హాస్పిటల్ వద్ద వెయ్యిమంది ఒకే షిఫ్టులో పని
చేస్తున్నారు.. వచ్చే మార్చినాటికి పూర్తి చేస్తాం.. ఎల్బీనగర్ టిమ్స్‌ను వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి తెస్తాం. నిమ్స్ హాస్పిటల్ రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్నాం.. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం అని చెప్పారు. వరంగల్ హాస్పిటల్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తాం అని చెప్పారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయం కోసం పొలిటికల్ విజిట్స్ చేశారు.. ప్రజల మేలు కోసం తాము చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సుమారు రూ.8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి హంగులతో ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నిర్మించాం.. త్వరలో డిజిటల్ క్లాస్‌తోపాటు ఏసీ రూంలు ఏర్పాటు చేయనున్నాం.. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోకెల్లా బెస్ట్ మోడల్ స్కూల్‌గా నిలవనుంది.. విద్యకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.. ప్రపంచంతో పోటీ పడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ అంతా కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించాం.. రూ.20 వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో ఈ అధునాతన రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. నల్గొండలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్లాబ్ లెవల్ వరకు వచ్చింది అని వివరించారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను ఇంత చక్కగా నిర్మించేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, జిల్లా కలెక్టర్ హరిచందన, ఆర్ అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మంత్రి శుభాశీస్సులు మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





