కూట‌మి ఐక్య‌త‌ను చాటుతున్న జార్ఖండ్ నేత‌లు

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు భట్టి నివేదిక

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : రాబోవు రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో దిల్లీలో ఆయన సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను నివేదించారు. జార్ఖండ్‌లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో తాను జరిపిన చర్చల గురించి వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడంపై జార్ఖండ్ స్థానిక నాయకత్వంతో జరిపిన సంప్రదింపులను భట్టి విక్రమార్క ప్రస్తావించారు. కూటమి ఐక్యతను చాటేలా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును ఖర్గేకు వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *