జైషే మహ్మద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ ‌ఛేదన

– ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఐదుగురి అరెస్ట్

‌గాంధీనగర్‌,‌ జులై 17: ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ ‌పోలీసులు జైషే మహమ్మద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ను ఛేదించారు. పాకిస్థాన్‌ ‌కేంద్రంగా నడుస్తోన్న ఈ ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. బిలాల్‌ అబిద్‌ ‌షేరా, మహమ్మద్‌ అయూబ్‌ ‌కడివాల్‌, ‌మహమ్మద్‌ ‌షఫీ ముఖి, మహమ్మద్‌ ‌హసన్‌ ‌కరాడియా, మహమ్మద్‌ ‌సునాసరగా వారిని గుర్తించారు. న్యాయస్థానం వీరికి జులై 24 వరకు పోలీసు కస్టడీ విధించింది. ఇటీవల ఎనిమిది మంది జైషే అనుమానితులను గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రకార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక నెట్‌వర్క్ ‌కోసం వారు యత్నిస్తున్నట్లు తెలిసింది. వారిని విచారిస్తున్నప్పుడే ఈ ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *