– జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలతో..
– డీజీపీని కలిసి రక్షణ కల్పించాలన్న నాగేశ్వర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో నాగేశ్వర రావు ఇంటివద్ద తెలంగాణ పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో ఆయన డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. తనకు భద్రత కల్పించాలని కోరారు. కాగా, రాష్ట్రంలో అరెస్టు చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు వస్తే హైకోర్టులో అరెస్టు రద్దు చేసేందుకు రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


