ఉపగ్రహ అంతర్జాలం ప్రయోజనమేనా ?

మన దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ అం‌దించడానికి ఈ మధ్య కాలంలో జియో, ఎయిర్టెల్‌ ‌టెలికాం సంస్థలు ఎలోన్‌ ‌మస్క్ ‌కంపెనీకి చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ అం‌టే ఏమిటి ? దీని ఉపయోగాలు, సవాళ్లు గురించి పరిశీలిద్దాం.
ఉపగ్రహ ఇంటర్నెట్‌:
‌డిజిటల్‌ ‌యుగంలో పట్టణ,మారుమూల కొండ ప్రాంతాల మధ్య డిజిటల్‌ అం‌తరాన్ని తగ్గించడానికి ఇంటర్నెట్‌ ‌కీలకపాత్ర పోషిస్తుంది. మారుమూల ప్రాంతానికి సాంప్రదాయ ఇంటర్నెట్‌ అం‌దించడం సాధ్యం కాదు. ఇటువంటి ప్రాంతాలకు అంతర్జాలం అందుబాటులోకి తేవడానికి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది వినియోగదారులకు ఇంటర్నెట్‌ ‌సేవలను అందించడానికి భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలపై ఆధారపడే ఒక రకమైన ఇంటర్నెట్‌ ‌కనెక్షన్‌. ఈ ‌పద్ధతిలో ఉపగ్రహాల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇంటర్నెట్‌ ‌సర్వీస్‌ ‌ప్రొవైడర్లు అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహానికి ఇంటర్నెట్‌ ‌సిగ్నల్‌ను పంపుతారు.
ఈ ఉపగ్రహం భూమిపై నెట్‌వర్క్ ఆపరేషన్స్ ‌సెంటర్‌ (‌నాక్‌) అని పిలువబడే ప్రదేశానికి డేటాను ప్రసారం చేయడానికి,  స్వీకరించడానికి బాధ్యత వహిస్తుంది. నాక్‌ అనేది ఇంటర్నెట్‌ ‌లేదా ప్రైవేట్‌ ‌నెట్‌వర్క్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఒక కాంపాక్ట్ ‌డిష్‌ ‌ద్వారా డేటా ట్రాన్స్‌మిషన్‌, ‌రిసెప్షన్‌ను అనుమతిస్తుంది. ఇది భూమధ్యరేఖకు 22,300 మైళ్ల ఎత్తులో ఉన్న జియోస్టేషనరీ ఉపగ్రహంతో కమ్యూనికేట్‌ ‌చేస్తుంది. ఈ సంకేతాలు వినియోగదారుల వద్ద ఏర్పాటు చేయబడ్డ డిష్‌ ‌ద్వారా మోడెమ్‌ ‌నుండి కంప్యూటరకు ఇంటర్నెట్‌ ‌సిగ్నల్స్ అం‌దుతాయి. ఈ ప్రక్రియ ఇంటర్నెట్‌ ‌సర్వీస్‌ ‌ప్రొవైడర్‌కు తిరిగి వెళ్లి ప్రతిసారీ పునరావృతమవుతుంది. తద్వారా ఇంటర్నెట్‌కు చేరుకునే ముందు ఉపగ్రహ డిష్‌ అనేది కక్ష్యలో ఉన్న ఉపగ్రహం మధ్య అన్ని కమ్యూనికేషన్‌లకు  మధ్యవర్తిగా పనిచేస్తుంది.
ఉపగ్రహాల పాత్ర:
ఉపగ్రహ ఇంటర్నెట్‌ ‌సేవ సాధారణంగా వ్యక్తిగత వినియోగదారులకు భూస్థిర ఉపగ్రహాల ద్వారా అందించబడుతుంది. ఇవి సాపేక్షంగా అధిక డేటా వేగాన్ని అందిస్తాయి. కొత్త ఉపగ్రహాలు సెకెనకు 506 మెగాబిట్స్ ‌వరకు డౌన్‌‌స్ట్రీమ్‌ ‌డేటా వేగాన్ని సాధించడానికి ‘క్యు’ (కెయు) బ్యాండ్‌ని ఉపయోగిస్తాయి. అంతరిక్షంలో ఒక నిర్దిష్ట బిందువు వద్ద ఉపగ్రహాన్ని భూమి నుండి కదలకుండా కనిపించే కక్ష్యలో ఉంచుతారు. దీని ఫలితంగా ఉపగ్రహం భూమి చుట్టూ ఒక కక్ష్యను ఖచ్చితంగా 24 గంటల్లో లేదా ఒక రోజులో పూర్తి చేస్తుంది. భూస్థిర ఉపగ్రహాలు ప్రత్యేకంగా భూమి యొక్క భూమధ్యరేఖకు నేరుగా 22,300 మైళ్ల ఎత్తులో ఉంచబడతాయి. ఉపగ్రహం ద్వారా పంపబడిన సమాచారం కాంతి వేగంతో కదులుతుంది. ఇది సెకనుకు 1,86,000 మైళ్ళు. అయితే కక్ష్యలో ఉన్న ఉపగ్రహం భూమి నుండి ఉండే ఈ దూరాన్ని నాలుగు సార్లు ప్రయాణించాలి. అంటే కంప్యూటర్‌ ‌నుండి ఉపగ్రహానికి, ఉపగ్రహం నుండి నాక్‌ ‌లేదా ఇంటర్నెట్‌కు, అక్కడనుండి ఉపగ్రహానికి, చివరకు ఉపగ్రహం నుండి కంప్యూటర్‌కు తిరిగి వెళ్ళాలి. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని జాప్యం అంటారు. ఇది దాదాపు అర సెకను.
ప్రయోజనాలు:
సాంప్రదాయ ఇంటర్నెట్‌ ‌మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు చేరుకోవడం ద్వారా ప్రపంచ ఇంటర్నెట్‌ ‌కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే శక్తివంతమైన సాంకేతికతగా మారింది. ఇది చాలా ప్రాంతాన్ని కవర్‌ ‌చేస్తుంది. ఇప్పటివరకు ఇంటర్నెట్‌ ‌సేవలు అందని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అం‌దిస్తాయి. స్థిర ఇంటర్నెట్‌ ‌మౌలిక సదుపాయాలు లేకుండా తరచుగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లేవారికి, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు,  హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌ ‌యాక్సెస్‌ అవసరమయ్యే వ్యక్తులకు,  సమాచార ప్రసారానికి, ప్రభుత్వ సంస్థలను అనుసంధానించడానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఎత్తైన భవనాలు, సాంకేతిక సమస్యల కారణంగా అంతరాయాలకు గురయ్యే భూసంబంధమైన నెట్‌వర్క్‌ల మాదిరిగా కాకుండా ఉపగ్రహ కనెక్షన్‌లు భూమిపై భౌతిక అడ్డంకుల వల్ల ప్రభావితం కావు. సవాలుతో కూడిన వాతావరణాలలో, అత్యవసర సమయాల్లో కూడా నిరంతరాయంగా ఇంటర్నెట్‌ ‌సదుపాయాన్ని ఆస్వాదించవచ్చు. ఆర్థిక అభివృద్ధి, విద్య, కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. స్థిరమైన ఇంటర్నెట్‌ ‌కనెక్టివిటీ అవసరమైన సముద్ర, విమానయాన పరిశ్రమలలో కూడా ఉపగ్రహ ఇంటర్నెట్‌ ఉపయోగపడుతుంది.
సవాళ్లు పరిమితులు:
ఉపగ్రహ ఇంటర్నెట్‌ ‌ప్రధాన లోపాలలో ఒకటి జాప్యం. ఇది వినియోగదారు పరికరం అంతరిక్షంలో ఉపగ్రహం మధ్య డేటా సిగ్నల్‌లను ప్రసారం చేయడంలో ఆలస్యాన్ని సూచిస్తుంది. ఇది భూసంబంధమైన నెట్‌వర్క్‌లతో పోలిస్తే నెమ్మదిగా కనెక్షన్‌ ‌వేగానికి దారితీస్తుంది. ఇది ముఖ్యంగా ఆన్‌లైన్‌ ‌గేమింగ్‌ ‌లేదా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌వంటి రియల్‌-‌టైమ్‌ ‌కమ్యూనికేషన్‌ అవసరమయ్యే కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. పరికరాలు, సేవా ప్రణాళికల ఖర్చు, సెటప్‌ ‌చేయడానికి సాధారణంగా ఉపగ్రహ డిష్‌ ‌పరికరాలు, ఇన్‌స్టాలేషన్‌ ‌ఫీజులు, నెలవారీ సబ్‌‌స్క్రిప్షన్‌, ‌ఖర్చులలో ప్రారంభ పెట్టుబడి అవసరం. పరిమిత ఆర్థిక వనరులు కలిగిన వ్యక్తులు లేదా వ్యాపారాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో చాలా ఖరీదైనది కావచ్చు.
బ్యాండ్‌విడ్త్ ‌పరిమితులు, జాప్యం సమస్యలు, వాతావరణ జోక్యం, సిగ్నల్‌ అం‌తరాయాలు, వేగ వైవిధ్యాలు, భద్రతా సమస్యలు, గోప్యతా ప్రమాదాలు ఉపగ్రహ ఇంటర్నెట్‌ ‌యొక్క కీలక సవాళ్లు. ఈ అడ్డంకులు సజావుగా కనెక్టివిటీకి ఆటంకం కలిగిస్తాయి. వాతావరణ జోక్యం, అధిక ఖర్చులు, సైబర్‌ ‌భద్రతా దుర్బలత్వాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. సంకేతాలు భూమి, ఉపగ్రహాల మధ్య చాలా దూరం ప్రయాణించాలి.  ముఖ్యంగా జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్‌ (‌జియో) ఉపగ్రహాలతో గుర్తించదగిన జాప్యాలు ఏర్పడతాయి. బ్యాండ్‌విడ్త్ ‌పరిమితులు ఇంటర్నెట్‌ ‌కనెక్షన్‌ ‌సామర్థ్యం, వేగాన్ని ప్రభావితం చేస్తాయి. వర్షం, మంచు, ఇతర వాతావరణ పరిస్థితులు సిగ్నల్‌ ‌ప్రసారానికి అంతరాయం కలిగించవచ్చు. దీని వలన సిగ్నల్‌ ‌నష్టం లేదా డేటా రేట్లు తగ్గుతాయి. ఉపగ్రహ ఇంటర్నెట్‌కు అవసరమైన పరికరాలు, ఉపగ్రహ డిష్‌ ‌సంస్థాపనతో సహా ఖరీదైనవి కావచ్చు.
ఉపగ్రహాలకు స్పష్టమైన లైన్‌-ఆఫ్‌-‌సైట్‌ ఉన్న ప్రాంతాలలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాలలో లేదా అడ్డంకిగా ఉండే భూభాగాలు ఉన్న ప్రాంతాలలో సవాలుగా ఉంటుంది. ఇంటర్నెట్‌ ‌కోసం వేలాది ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల అంతరిక్ష శిథిలాల గురించి ఢీకొనే అవకాశం గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఉపగ్రహాలు జామింగ్‌, ‌హ్యాకింగ్‌, ఇతర సైబర్‌ ‌దాడులకు గురవుతాయి. ఇవి ఇంటర్నెట్‌ ‌కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తాయి. ఉపగ్రహ ఇంటర్నెట్‌ ‌మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అమలు చేయడానికి అయ్యే అధిక వ్యయం కొన్ని కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉంటుంది. ఇవన్నీ వినియోగదారు అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి. కార్యాచరణ అడ్డంకులను కలిగిస్తాయి. వీటిని అధిగమించడానికి ఉపగ్రహ ఇంటర్నెట్‌ ‌యాక్సెస్‌ను మెరుగుపరచడానికి డిజిటల్‌ అం‌తరాన్ని సమర్థవంతంగా తగ్గించడానికి వినూత్న పరిష్కారాలు, నియంత్రణ అమరిక సాంకేతిక పురోగతులు అవసరం.
image.png
జనక మోహన రావు దుంగ
ఎమ్మెస్సీ (ఫిజిక్స్)
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page