బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?

  • దేశంలో  సామాజిక న్యాయం  అమలు చేసింది కాంగ్రెస్సే..
  • సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే..  
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 9: ‌బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. శనివారం గాంధీ భవన్‌ ‌లో మీడియా సమావేశంలో మాట్లడుతూ బీజేపీ నేత లక్ష్మణ్‌ ‌మాటలు చూసిన తర్వాత ఆయన ఏ వర్గాల నుంచి వొచ్చిన వారు అదే వర్గాలకు మద్దతుగా లేకున్నా.. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.వేల ఏళ్ల అసమానతలకు చరమ గీతం పాడేందుకు సంక్షేమ చట్టాలుసామాజిక న్యాయ విధానాలు దేశంలో అమలు చేసింది కాంగ్రెస్‌ ‌కాదా..? వెనుకబడిన తరగతులు (ఓబీసీ) అనే పదాన్ని మొదటిసారి పార్లమెంటు వేదికగా ఉపయోగించింది తొలి ప్రధాని నెహ్రూ తప్ప మరెవరూ కాదు. డిసెంబర్‌ 13,1946 ‌న రాజ్యాంగ సభ ముందు లక్ష్యాల తీర్మానాన్ని సమర్పించిన నెహ్రూ వెనుకబడిన గిరిజన ప్రాంతాలు, అణగారిన ఇతర వెనుకబడిన వర్గాలు అనుకూలంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రిజర్వేషన్లు ఒక్కటే చాలవు అన్ని వర్గాల మధ్య సమానత్వం కోసం విద్యా ప్రతిష్టకు అవసరమని రాష్ట్ర సీఎంలకు ప్రధాని నెహ్రూ లేఖ రాశారు.. ఆ లేఖను అలా చూడకుండా బిజెపి కోడిగుడ్డు మీద ఈకలు పీకే యత్నం చేస్తుంది. విపి సింగ్‌ ‌ప్రభుత్వం ఓబిసి రిజర్వేషన్ల ప్రతిపాదన తెస్తే రథయాత్ర చేసింది బిజెపి.. మండల్‌ ‌కు పోటీగా కమండల్‌ ‌రాజకీయాలు చేసి దేశాన్ని ఇబ్బందులు పెట్టింది బిజెపి.. సంగ్‌ ‌శక్తులు, విపి సర్కార్‌ ‌ను సర్కాను కూల్చి ఓబిసి వ్యతిరేక వైఖరిని బిజెపి చాటుకుందని విమర్శించారు.. చంపకం దొరై రాజన్న కేసులు దేశంలో రిజర్వేషన్లు 1951లో సుప్రీం కోర్టు కొట్టి వేస్తే.. పార్లమెంటులో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపట్టి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని రాజ్యాంగబద్దం చేసింది తొలి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అది మా కమిట్మెంట్‌..‌కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి,ఐఐఎం వంటి ఉన్నత సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌. ‌విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలు తెచ్చింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అని స్పష్టంచేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల రిజర్వేషన్లు పెట్టాలా వద్దా బీజేపీ చెప్పాలని మంత్ర పొన్నం డిమాండ్‌ ‌చేశారు. మీరు కుల గణన కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ‌తెచ్చింది బీజేపీ..వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ల కల్పించింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం..బీహార్‌ ‌లో కుల గణన చేసిన నితీష్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వాన్ని కూలగొట్టింది మీరు కాదా. పెంచిన రిజర్వేషన్లను ఆపిన పాపం బిజెపిది. రిజర్వేషన్లు 14 నుంచి 27% కి పెంచుతూ జార?ండ్‌ ‌ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్‌ ‌చేస్తే గవర్నర్‌ ‌సంతకం చేయకుండా బీజేపీ అడ్డుకుంది అని ఆరోపించారు. కుల గణన పై అసెంబ్లీలో తీర్మానం చేసిన మహారాష్ట్ర ఉద్ధవ్‌ ‌ఠాక్రే ప్రభుత్వాన్ని కులగొట్టింది..బలహీన వర్గాల ప్రధాని అని చెప్పి మోదీ బీసీల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. జార?ండ్‌ ‌లో అవసరమైతే 50 శాతం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామని అమిత్‌ ‌షా చెప్పారు..కేరళలో జరిగిన ప్లీనరీలో కుల గణనకు వ్యతిరేకం కాదన్నారు.. 50 శాతం రిజర్వేషన్లు దాటిన ఇబ్బందీ లేదన్నారు..మోదీ ఒక విధంగా, బీజేపీ ఒక విధంగా, అమిత్‌ ‌షా మరో విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర బీసీ అధ్యక్షుడిని తొలగించి రెడ్డికి ఇచ్చారు. ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని 8 సీట్లు గెలిచిన తరువాత రెడ్డి బీజేఎల్పీ లీడర్‌ ‌ను చేశారు.

సర్వే సమాచారం గోప్యంగా ఉంచుతాం
ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని, ప్రభుత్వం సేకరిస్తున్న సమాచారం గోప్యంగా ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని సామాజిక, ఆర్థిక ,రాజకీయ ,ఉద్యోగ న్యాయం చేయడం జరుగుతుంది . ఎస్సి ఎస్టీ బీసీలకు 22.5 శాతం రిజర్వేషన్లు దాటడం లేదు. దానికి మోదీ విధానాలే కారణం. కేంద్ర ప్రభుత్వం లో 90 మంది ఐఏఎస్‌ ‌లు ఉంటే ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. సామాజికంగా మార్పు రావడానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సర్వే చేస్తుంది. బీజేపీ బీసీ ఎస్సీ ఎస్టీ లకు వ్యతిరేక పార్టీ. పెద్దల పార్టీ .కార్పొరేటర్ల పార్టీ..బీ జేపీ మాటల పట్ల బలహీన వర్గాలు అప్రమత్తంగా ఉండాలి. సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా దేశానికి దిక్సూచిలా తెలంగాణ ప్రభుత్వం సమాచార సేకరణ జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే లాగ అల్మారా లో కోల్డ్ ‌స్టోరేజిలో పెట్టం.. పబ్లిక్‌ ‌డొమైన్‌ ‌లో పెడతాం.. కుల గణన సర్వే చేపట్టలేదు.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సర్వే కి మద్దతుగా ఉండండి.. మూసి పరీవాహక జీవన విధానాలు మార్చాలని ముఖ్యమంత్రి సంగెం అక్కడ ఉన్న మురికి చూశాం. రైతులు, గీత, కుమ్మరి, కమ్మరి కుల వృత్తిదారుల సమస్యలు విన్నాం.. కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు కోరినట్లు కులగొట్టిన ప్రాంతాలకు వొస్తాం. ఎవరికి అన్యాయం చేయం. అందరికీ న్యాయం చేస్తాం.

రీహాబిలిటేషన్‌ ‌యాక్ట్ ‌ప్రకారం వాళ్ళకి చేయాల్సినవి చేస్తం. చట్టానికి లోబడి, ఒప్పించి మెప్పించి చేస్తం. కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌ ‌లో పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. గతంలో టూరిజం మంత్రి అర్కియాలజి కి ఏమైనా నిధులు తెచ్చారా. సికింద్రాబాద్‌ ‌టవర్‌ ‌సర్కిల్‌ ‌లో నిధుల పై చర్చకు సిద్దం. వరదల్లో అంచనా చెప్పి ప్రెజెంటేషన్‌ ఇచ్చి నష్ట పరిహారం చెప్తే పిల్లికి బిచ్చం వేసినట్లు 400 కోట్లు ఇచ్చారు. కేటీఆర్‌ ‌ను జైల్లో పెడతాం రూంలు కడతాం అన్నది బండి సంజయ్హై. హైదరాబాద్‌ ‌వరదల్లో బండి పోతే బండి అన్నది బండి సంజయ్‌.‌తప్పు చేస్తే శిక్షకు అర్హులే.. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిఎల్‌ ‌సంతోష్‌ ‌ను అరెస్టు చేస్తామన్న కెసిఆర్‌ ‌చేయలేదన విమర్శించారు. ఉచిత బస్సు ,200 యూనిట్ల విద్యుత్‌ ,500 ‌కి గ్యాస్‌ ఇస్తున్నాం..విద్యా సంస్కరణలు చేస్తున్నాం. విద్యా, వైద్య ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి, రైల్వే ప్రాజెక్టుల ఇవన్నిటీపై మీకు చేతనైతే సహాయం చేయండి లేదంటే మమ్మల్ని తీసుకుపోండి. వొచ్చే పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులం దిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాం.

తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించండి..తెలంగాణ ఏర్పాటు ను ప్రధాన మంత్రి వ్యతిరేకంగా మాట్లాడిన మీరు ఖంధించని మీరు చరిత్ర హీనులుగా మాట్లాడతారు..కుల గణన మీద వ్యతిరేకంగా మాట్లాడిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ ‌మాటలు వెనక్కి తీసుకోవాలని పొన్నం డిమాండ్‌ ‌చేశారు.. సర్వే పూర్తైన తరువాతే ఎన్నికలకు వెళ్తాం. డెడికేషన్‌ ‌కమిటీ సమావేశం.. ప్రభుత్వం అన్ని రకాలుగా కుల సర్వే ఫారాలు 87 వేల మంది ఎన్యుమరేటర్స్ ‌కి చేరాల్సిందే..ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు. బలహీన వర్గాల సంక్షేమం కోసం నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఏం చేశాయో పార్లమెంటు లైబ్రరీ నుంచి వివరాలను లక్ష్మణ్‌ ‌కి పంపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page