– ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు కుట్ర
– అనుమతించిన ప్రాజెక్టుల రద్దు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా?
– 18న జరగబోయే జీఆర్ఎంబీ సమావేశం అజెండా పూర్తిగా ఏపీకి అనుకూలం
– ఏపీ వితండవాదాన్ని ఎందుకు ఖండించడంలేదు
– సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టును ఏపీ అడ్డుకుంటోంది
– రేవంత్ తెలంగాణకు ద్రోహం చేసి గురుదక్షిణ చెల్లించుకుంటున్నరా?
– నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ఈనెల 18న హైదరాబాద్ వేదికగా హైదరాబాద్‌లో జరగబోయే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం అజెండాపై తెలంగాణ భవన్‌లో బుధవారం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెరో ఎజెండాను సిద్ధం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మౌనం చూస్తుంటే జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. కేఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించుకున్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ (47 టీఎంసీలు) వంటి 7 కీలక ప్రాజెక్టులకు తెచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం పంపిన ఈ ప్రతిపాదనలను జీఆర్ ఎబీ తన అజెండాలో చేర్చడంపై నిప్పులు చెరిగారు. ఈ అజెండా పూర్తిగా ఏపీకి లాభం చేకూర్చేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి ‘గురుదక్షిణ’ చెల్లించుకోవడానికే సీఎం నోరు మెదపడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతులు తీసుకురాలేకపో యిందని, ఉన్న అనుమతులను కూడా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తోందని విమర్శించారు. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు ఇవ్వవద్దని ఏపీ చెబితే, దాన్ని బోర్డు అజెండాలో ఎలా పెడతారని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ కట్టొచ్చు కానీ సమ్మక్క బ్యారేజీ ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. కాళేశ్వరం అనుమతులు రద్దయితే సగం తెలంగాణకు తాగు, సాగునీరు దూరం అవుతుందని.. నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా? చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే… రేవంత్ రెడ్డి రక్తం ఎందుకు మరగడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదేపదే చెబుతారు. కానీ జీఆర్ఎంబీ ముందు పెట్టిన ఎజెండా చూస్తే అసలు నిజం ఏంటో అర్థమవుతుంది. కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోంది. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ కోరుతోంది. ఆ ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయంటే… కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అనుమతుల వల్లే. ఇప్పుడు అదే సీతారామ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. తెలంగాణకు చెందిన ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంజినీర్లు ఏం చేస్తున్నారు? ఇప్పటికే అనుమతులు సాధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారు? తెలంగాణ కోసం ఉద్యమం చేసి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించింది. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు. సమ్మక్క, పాలమూరు, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లు రిటర్న్ వచ్చాయి. ఒక్క టీఎంసీ నీటికి కూడా కొత్తగా అనుమతి సాధించలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా? నిద్రపోతున్నారా? ఎజెండాలో ఈ అంశాలు రావడమే దుర్మార్గమైన విషయమన్నారు. దేశ చరిత్రలో అనుమతులు వచ్చిన తర్వాత వాటిని రివ్యూ చేయడం, రద్దు చేయడం జరిగిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. మరోవైపు సమ్మక్క బ్యారేజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని ఏపీ కోరుతోంది. సమ్మక్కకు అనుమతి ఇస్తే పోలవరానికి నీళ్లు తగ్గుతాయని ఏపీ ఎజెండాలో పేర్కొంది .గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే చెబుతోంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తామని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీలలో భాగంగా సమ్మక్క ప్రాజెక్టు నిర్మిస్తామంటే ఏపీ అడ్డుకుంటోంది. సమ్మక్క సాగర్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు సాధించిందని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలాంటి ఎజెండా జీఆర్ఎంబీ ముందుకు వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రులు ఎల్ర.మణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

———————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు