ఏర్పాట్లపై శిల్పారామంలో సి.ఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 04 :ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చేతుల మీదుగా శాల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిల్పా రామంలో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి నైట్ బజార్ ను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సందర్శించారు. ఏర్పాట్ల పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ల ను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం కావడంతో నైట్ బజార్‌లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి కే స్టాల్ ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని సీఎస్ పరిశీలించారు. స్టాల్ నిర్వాహకులకు, సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌళిక సదుపాయాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నైట్ బజార్ లో లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నైట్ బజార్ లో స్వయం శక్తి మహిళా సంఘాల చే తయారు చేయబడిన పిండి వంటకాల స్టాల్స్, హస్తకళలకు చెందిన స్టాల్స్, హహిళ లు స్వయంగా తయారు చేసిన పలు ఉత్పత్తులకు చెందిన స్టాల్స్, పలు శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రారంబోత్సవానికి గవర్నర్, ముఖ్యమంత్రి తో పాటు పలువురు ప్రముఖులు, మహిళలలు, సందర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీ ఎస్ ఆదేశించారు. ఈ పర్యటనలో పంచాయతీ రాజనశాఖ కమిషనర్ లోకేష్ కుమార్ , సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.