భారతీయ సంస్కృతిని పటిష్టం చేసుకోవాలి

లోక్‌మంథన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు
రెండు రోజుల పర్యటన ముగించుకుని దిల్లీకి ప్రయాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్‌మంథన్‌ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్‌ భావన నెలకొల్పాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రాలను బలోపేతం చేసే    దిశగా లోక్‌ మంథన్‌ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ‘2018లో రాంచీలో లోక్‌మంథన్‌ కార్యక్రమంలో పాల్గొన్నా. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పటిష్ఠానికి ఈ ప్రయత్నం గొప్పది. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఇంద్రధనస్సులోని సౌందర్యాన్ని సూచిస్తుంది‘ అని ద్రౌపదీ ముర్ము అన్నారు.  దేశ సంస్కృతి సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం అని లోక్‌ మంథన్‌ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనవి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం.. పాటిస్తామన్నారు. ఇదే మన బలం, ఇదే మన స్థైర్యం అని తెలిపారు. ఇన్ని భిన్న సంస్కృతులు ఒకేచోట ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అన్నారు. ఇవన్నీ కలిసిన సుందరమైన ఇంద్రధనస్సు లాంటి దేశం మనదన్నారు. వనవాసి, నగరవాసి అని లోకమంథన్‌ కార్యక్రమంలో.. అహల్యాబాయ్‌ హోల్కర్‌, రాణి రుద్రమదేవి, రaాన్సీ లక్ష్మీబాయి వంటి వీరాంగనలపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. వారి ప్రేరణ ఎప్పటికీ మనకు అవసరం అన్నారు. విదేశాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుండటం అభినందనీయం అన్నారు. ఇండోనేషియా సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతిని ప్రదర్శిస్తుండటాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక భావనలు, కళలు, సంగీతలు, విద్య, వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయన్నారు. ప్రపంచానికి మనం జ్ఞాన దర్శనం చేశామన్నారు.

ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఏర్పడిరది. విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన ద జులూం ప్రదర్శించాయి. మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయి. మనలో ఐకమత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు. మనలో బానిస మూలాలను చొప్పించారన్నారు. కానీ మన దేశ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. వీటిని నిరంతరం జీవింపజేశారన్నారు. ఇకపైనా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం బానిసత్వ మూలాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్‌ పథ్‌ పేరు కర్తవ్యపథ్‌ మారిందన్నారు. దర్బార్‌ హాల్‌ పేరు.. గణతంత్ర మండప్‌ గా మార్చామన్నారు. ఇది బానిసత్వ ఆలోచనలను తొలగించే దిశగా జరుగుతున్న ప్రయత్నం అన్నారు.

మన ఆలోచనలు కూడా మారాలని తెలిపారు. ఇటీవల.. ఓ హైకోర్టులో మహిళా జడ్జి విగ్రహాన్ని ప్రారంభించారన్నారు. కానీ ఆ విగ్రహం కళ్లకు నల్లని గంతల కట్టలేదని, ఇది మనం సాధిస్తున్న మార్పునకు సంకేతం అన్నారు. మన ఆలోచనలు కూడా మారాలని తెలిపారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. ఐకమత్యం, సమరసతే మన సభ్యత.. మన భవిష్యత్తు అన్నారు. ఈ దిశగా మనమంతా కలిసి పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌స్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. లోక్‌ మంథన్‌ కార్యక్రమం అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుగు ప్రయాణం అయ్యారు. నేటితో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన ముగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page