హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్22: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు చురకుగా సాగుతున్నాయి. డిసెంబర్ 9న విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.