జార్ఖండ్‌ ‌లో ఇండియా కూటమి సమష్టి విజయం

పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం హర్షణీయం..
•రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాంచి, నవంబర్‌ 23 :  ‌జార్ఖండ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు… తమ అందరి సమష్టి విజయమని,  ఇక్కడ బిజెపి తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిజెపి  కొనుగోలు జిమ్మిక్కులు ఇక్కడ సాగవు. మా ఎమ్మెల్యేలు పార్టీ పట్ల, భావజాలం పట్ల కమిట్మెంట్‌ ‌తో ఉన్నారని తెలిపారు. రాంచీలో ఆయన విలేకరులతో మాట్లా డుతూ..
జార్ఖండ్‌ ‌మైన్స్, ‌మినరల్స్ ఈ ‌రాష్ట్ర ప్రజలకే చెందాలని,  అలా కాకుండా అదాని, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

తమ నాయకులు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఇక్కడికి వొచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు. సంవిధాన్‌ ‌సమ్మేళన్‌ ‌భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ దాని ద్వారా వొచ్చిన హక్కులను కాపాడుతామని భరోసా ఇచ్చారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంపద, ఆస్తులు సమానంగా పంచాలని, మన భారత రాజ్యాంగం చెబుతుందని మా పార్టీ నాయకత్వం వివరంగా ప్రజలకు చెప్పిందని తెలిపారు.  జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ ‌కూటమి గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు… మరోసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తే ఏం చేస్తామో బడ్జెట్‌ అం‌కెలు, సంఖ్యలతో వివరంగా చెప్పాం.  మా కూటమి నేతల మాటలను ప్రజలు విశ్వసించారు. బిజెపి పట్ల మాకు భ్రమలు లేవని ఈ ప్రాంత ప్రజలు నమ్మి ఇండియా కూటమికి భారీ మెజారిటీని ఇచ్చారని భట్టి తెలిపారు.

రాహుల్‌ ‌గాంధీ, సోరేన్‌ ‌వంటి యువ నాయకులు, ఖర్గే లాంటి అనుభవం కలిగిన వ్యక్తుల సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు ఉంటే మంచిది. వీరిని కాకుండా క్రోని క్యాపిటల్స్, ‌బహుళ జాతి సంస్థలకు ఈ రాష్ట్ర సంపాదన కట్టబెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని వివరించాం. ఈ విషయాలను జార్ఖండ్‌ ‌ప్రజలు విశ్వసించారు. ఇండియా కూటమి గెలిస్తే బంగ్లాదేశ్‌ ‌నుంచి వలసలు వెల్లువెత్తుతాయి, చొరబాటుదారులు పెరుగుతారని బిజెపి తప్పుడు ప్రచారం చేసింది. చొరబాటు దారులను నియంత్రిం చాల్సింది సరిహద్దుల్లోని బిఎస్‌ఎఫ్‌, ఆ ‌సంస్థ కేంద్ర ప్రభుత్వంలోని బిజెపి చేతిలో ఉంది.. వారి వైఫల్యం మూలంగానే చొరబాటుదారులు పెరుగుతున్నారు. వారి వైఫల్యాన్ని ఇతరుల వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేము జార్ఖండ్‌ ‌ప్రజలకు వివరించాం. ఇక్కడి ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళ మాటలు నమ్మలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రజలకు ధన్యవాదాలు..
ప్రజల, పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ందుకు వోటర్లకు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. కూటమి అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.  ఈ చారిత్రాత్మక తీర్పు కూటమి దార్శనికత, నాయకత్వంపై ఉంచిన విశ్వాసం, ఆశకు నిదర్శనమని అన్నారు.  ఈ అద్భుత తీర్పు కోసం శ్రమించిన ఇండియా కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు. మా ఏడు హామీల ద్వారా జార్ఖండ్‌ ‌హక్కుల పరిరక్షణకు, జార్ఖండ్‌• ‌భవిష్యత్తు భద్రతకు కట్టుబడి ఉన్న నాయకత్వంపై అచంచలమైన నమ్మకాన్ని ఈ తీర్పు ప్రతిబింబిస్తుందన్నారు.

జార్ఖండ్‌ ఎన్నికల్లో సీనియర్‌ ‌పరిశీలకునిగా, స్టార్‌ ‌క్యాంపెనర్‌ ‌గా పనిచేసే బాధ్యతను అప్పగించినందుకు అఖిలభారత కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయ కుడు రాహుల్‌ ‌గాంధీకి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్‌ ‌పార్టీ లక్ష్య సాధనకు దోహదపడే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, జార్ఖండ్‌ ‌జల భవిష్యత్తు నిర్మించడానికి కూటమి సభ్యులం కలిసి ముందుకు సాగుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page