కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మలేదు
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఎమ్మెల్యే హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు. తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నారని, కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయని హరీష్ రావు అన్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు కాంగ్రెస్ అబద్ధపు హామీలపై అక్కడ ప్రచారం చేశారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిందని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ఐదు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ఆ రాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని ఈ ఎన్నికల ద్వారా తేలిందని మాజీ మంత్రి అన్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని హరీష్ రావు అన్నారు. ఇక్కడ పథకాలు అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3వేలు ఇస్తామనడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన చెప్పుకొచ్చారు. రైతు భరోసా ఎగ్గొట్టారని, ఆసరా ఫించన్లను సైతం పక్కన పెట్టేశారని ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటి అంశాలను మహా ప్రజలు గమనించారని ఆయన తెలిపారు.
ఈ అంశాలన్నీ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టాయని హరీష్ రావు అన్నారు. అలాగే జార?ండ్ ఎన్నికలపైనా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. జార?ండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై బీజేపీ పార్టీ అక్రమ కేసులు పెట్టిందని, ఆయన్ని అరెస్టు చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. అలాగే హేమంత్ సోరెన్ పార్టీని సైతం చీల్చేందుకు కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. దీన్ని గమనించిన జార?ండ్ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఓడించారని ఆయన చెప్పారు. బీజేపీ కక్షసాధింపు విధానాలని ప్రజలు హర్షించడం లేదని తేలిపోయిందని అన్నారు. విజయం సాధించిన హేమం.