ఇప్పుడు మౌనం వహిస్తే మరెప్పుడూ ప్రశ్నించలేం

-ధర్మేంధ్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గం
-విద్యార్థుల భవిష్యత్‌ ‌కోసమే తమ ఆందోళన
-కాక్రోచ్‌ ‌పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే వెల్లడి

న్యూదిల్లీ, జూలై 24: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేసే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ స్పష్టం చేసింది. అదే తమ ప్రధాన డిమాండ్‌ అని తెలిపింది. గతంలో తమకు ఆందోళనలు చేసిన నేపథ్యం ఏ లేదని.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పోరాటం కొనసాగిస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే వెల్లడించారు. విద్యా వ్యవస్థ నాశనమైనందుకు దేశంలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. అందుకే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. కొందరు వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదని.. ఇప్పుడు మౌనం వహిస్తే, దేశం ఇంకెప్పటికీ ముందుకు సాగదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగు తున్నాయని.. ప్రజల మద్దతును ఎప్పటికీ మరిచిపోబోమని దీప్కే పేర్కొన్నారు. యువత మద్దతుతోనే ఇన్ని రోజులు జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరసనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చర్చల కోసం తాము కేంద్రమంత్రి జేపీనడ్డా నివాసానికి వెళ్లబోమని.. జంతర్‌మంతర్‌ ‌వద్దే చర్చలు జరగాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడమే.. ఈ విషయంలో తీసుకునే కఠిన చర్య అని పేర్కొన్నారు. విద్యార్థులపై దిల్లీ పోలీసుల దమనకాండను ఖండించారు. సీజేపీ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్దకు వేల సంఖ్యలో యువకులు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున భద్రతాబలగాలను మోహరించారు.

సిజెపి ఆందోళను ఆసరగా దుష్ప్రచారాలు
-480కి పైగా సోషల్ ‌మీడియా ఖాతాలు గుర్తించిన పోలీసులు

న్యూదిల్లీ, జూలై24:ప్రస్తుత సీజేపీ ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన 480కి పైగా సోషల్ ‌మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ఖాతాల ద్వారా వదంతులు, నకిలీ పోస్టులు, ఎడిట్‌ ‌చేసిన వీడియోలను వ్యాప్తి చేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ ఖాతాలను గుర్తించి బ్లాక్‌ ‌చేసే పక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. తాజాగా గుర్తించిన ఈ ఖాతాల ద్వారా ’ఆపరేషన్‌ ‌సిందూర్‌’ ‌సమయంలో కూడా తప్పుడు సమాచారం ప్రచారమైందని దిల్లీ పోలీసులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు సోషల్ ‌మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయిన కనీసం 18 తప్పుడు ప్రచారాలను ఇప్పటికే ఖండించామని తెలిపారు. నిరసనకారులపై పోలీసులు దాడి చేశారని, ఓ బాలిక మరణించిందని, కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారని, గోళీలు లేదా మేకులు అమర్చిన లాఠీలు వాడారని వచ్చిన ప్రచారాలు వాస్తవం కాదని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్‌ ‌డియాలో వచ్చే సందేశాలు, వీడియోలు లేదా పోస్టులను నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ ‌చేయొద్దని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం సృష్టించడం లేదా ప్రచారం చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *