సెప్టెంబర్‌ 11‌న బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె

– వరుస సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులే

న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ బ్యాంక్‌ ‌యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ ‌చేస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్‌ 11‌న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజున సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా నాలుగు రోజులపాటు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్‌ 11‌న శుక్రవారం. తర్వాత రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు. ఇక సోమవారం 14న  వినాయక చవితి కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల బ్యాంకు కార్యకలాపాలు నడవవు. అలా నాలుగు రోజులపాటు బ్యాంక్‌ ‌సేవలు అందక ప్రజలు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 11తోపాటు సెప్టెంబర్‌ 28 ‌నుంచి మూడు రోజులపాటు మరోసారి సమ్మె చేస్తామని యూనియన్‌ ‌హెచ్చరించింది. సెప్టెంబర్‌ 30‌తో ఆర్థిక సంవత్సరం సగం పూర్తవుతుంది. అప్పుడు అన్ని సంస్థలు తమ ఖాతా పుస్తకాలను సరిచూసుకుంటాయి. వారానికి ఐదు రోజుల డిమాండ్‌తోపాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం, పింఛను విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బ్యాంక్‌ ‌సిబ్బంది కోరుతున్నారు. ఇప్పటికే రెండో, నాలుగో శనివారం సెలవులు ఇస్తున్నారు. మరో రెండు సెలవులు ఇస్తే అలా నెలలో ఐదు రోజుల పని దినం అమలవుతుంది. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే అక్టోబర్‌ 26 ‌నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంక్‌ ‌యూనియన్ల సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *