మన హైడ్రా మంచిదైతే, కోర్టును అనడం ఎందుకు?

“ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రా మొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా ఇది అవసరమైన చర్య అనుకున్నారు. హైడ్రా మీద కొందరికైనా గురి ఏర్పడింది. ఈ కొత్త వ్యవస్థ నిజంగానే హైదరాబాద్ కు అవసరమైన పని ఏదో చేస్తుందనే నమ్మకం ఏర్పడింది..”

ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రామొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని  అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా ఇది అవసరమైన చర్య అనుకున్నారు. హైడ్రా మీద కొందరికైనా గురి ఏర్పడింది. ఈ కొత్త వ్యవస్థ నిజంగానే హైదరాబాద్ కు అవసరమైన పని ఏదో చేస్తుందనే నమ్మకం ఏర్పడింది. కాని ఆ తర్వాత హైడ్రా కార్యక్రమాలు మారిపోయాయి. నగరంలో కబ్జాలలో అత్యధిక భాగం ఉండే రాజకీయ నాయకుల, సంపన్నుల,శక్తిమంతుల ఆక్రమణల తొలగింపు క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది.

వారిని బెదిరించి వారి దగ్గర కప్పాలు వసూలు చేయడానికే తప్ప నిజంగా వారి ఆక్రమణల మీద ఎటువంటి చర్యలూ హైడ్రా జాబితాలో లేవని తేలిపోయింది. పేద, మధ్యతరగతి వర్గాల మీద దాడి ఎక్కువయింది. గచ్చిబౌలి, అమీన్ పూర్, ఐలాపూర్, నల్లగండ్ల, సున్నం చెరువు, బహదూర్ గూడ, లోతుకుంట, బతుకమ్మకుంట, నారపల్లి వంటి అనేక ప్రాంతాలలో నోటీసులు ఇవ్వకుండా, హెచ్చరికలు జారీ చేయకుండా, వందలాది మంది పోలీసులను మోహరించి, డజన్ల కొద్దీ బుల్డోజర్లతో ఇళ్ల మీద దాడి చేయడం, సొంత భూముల్లో నిర్మాణాలను కూడా కూల్చివేయడం, హైడ్రా అంటే భయం కలిగేట్టు ప్రవర్తించడం హైడ్రా గుర్తింపుగా మారిపోయింది. లక్షా యాభైవేల కోట్ల రూపాయల విలువగల మూడు వేల పైచిలుకు ఎకరాలు కబ్జాదారుల నుంచి రక్షించానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకుంటున్నారు గాని ఆయన ప్రకటనలోనే ప్రభుత్వ భూములు కానివాటి ప్రస్తావన ఉంది. చెరువులను, కుంటలను ఆక్రమించిన పెద్దవారికి మినహాయింపు ఉంది.

      ఈ కూల్చివేతల, భూస్వాధీనాలలో అనేక సందర్భాల్లో ఆ భూమి నిర్వివాదంగా ప్రభుత్వ భూమి అని తేలడం లేదు. సొంత పట్టా భూమిగా ఉంది. లేదా న్యాయస్థానాలలో వివాదాలలో ఉంది. అటువంటి అనేక సమస్యలు బైటపడ్డాయి. అందుకే వందలాది మంది బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించారు, హైడ్రా దౌర్జన్యం మీద దాదాపు వెయ్యి కేసులు నమోదయ్యాయంటున్నారు. రాష్ట్ర హైకోర్టు ఎన్నోసార్లు హైడ్రాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. నిర్దిష్టంగా కొన్ని భూముల, నిర్మాణాల జోలికి పోవద్దని ఆదేశాలు ఇచ్చింది. అయినా న్యాయస్థానపు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా రంగనాథ్ నాయకత్వంలో హైడ్రా భూ ఆక్రమణలను, కూల్చివేతలను కొనసాగిస్తున్నది. బాధితులు మళ్లీ న్యాయస్థానం తలుపు తట్టి కోర్టు ధిక్కార నేరం ఆరోపించారు. కమిషనర్ రంగనాథ్ మీద కనీసం 63 కోర్టు ధిక్కార నేరాలు ఉన్నాయంటే ఆయనకు, ఆయన ఆధ్వర్యంలోని హైడ్రాకు న్యాయస్థానం పట్ల, వివాదాలకు చట్టపరమైన పరిష్కారాలు కనుక్కోవాలనే సాధారణ న్యాయసూత్రం పట్ల లెక్క లేదని అర్థమవుతున్నది.

“గ్రామసీమల్లో ఉపాధి కరువై , ఏదో ఒక ఉపాధి వెతుకుతూ, స్థిరమైన ఉపాధి దొరకకపోయినా అడ్డాకూలీగా రోజువారీ జీవిక అయినా దొరుకుతుందనే నమ్మకంతో నగరానికి వలస వచ్చిన వేలాది మందికి నివాసస్థలం లేదు. ఎక్కడ ఖాలీ భూమి కనబడితే అక్కడ, మూసీ ఒడ్డున మురికిలో, మురికి వాడల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. వారి నివాసాలు కూడా రాజకీయ నాయకుల, బస్తీ నాయకుల పర్యవేక్షణలో, వారికి విపరీతంగా ముడుపులు చెల్లించి జరిగినవే. అటువంటి పేద వర్గాల మీద హైడ్రా దాడి చేసి, వారిని నిర్వాసితులను చేసింది..”

తాజాగా లోతుకుంటలో బహు అంతస్తుల భావనా నిర్మాణం జరగబోతున్న నలబై ఎకరాల భూమికి సంబంధించి, అది ప్రభుత్వ భూమి కాదని, తమ సొంత భూమి అని నిర్మాణ సంస్థ అంటుండగా,హైడ్రా ఆ భూమిలో ప్రవేశించి అక్కడి నిర్మాణాలను కూల్చివేసింది. హైకోర్టు స్టే విధించి, ఆ భూమిలో కల్పించుకోవద్దని హైడ్రాను ఆదేశించిన తర్వాత కూడా హైడ్రా పని ఆపలేదు. న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ఆ భూమిలోకి హైడ్రా ప్రవేశించకుండా సైన్యాన్ని పంపవలసి వస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అయినా హైడ్రా కమిషనర్ వ్యవహారశైలి మారకపోవడంతో, ఆయనను మందలించడం మాత్రమే గాక, ఆ పదవి నుంచి తొలగించమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఏ అధికారిని ఏ పదవిలో ఉంచాలో సంపూర్ణాధికారం తమదేనని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయస్థానంతో ఢీకొనడానికి నిశ్చయించుకున్నారు. ఈ వివాదం అంతిమంగా ఎటువైపు వెళ్తుందో చెప్పలేం గాని ఇక్కడ కొన్ని ఆలోచించవలసిన విషయాలున్నాయి.

 వర్గ సమాజంలో ప్రభుత్వ విధానాలు, రాజకీయాలు, ప్రభుత్వాలు,ప్రభుత్వ సంస్థలు సంపన్నులకూ శక్తిమంతులకూ అనుకూలంగా పని చేయడం ఆశ్చర్యమేమీ కాదు. కాని భూ ఆక్రమణల్లో సింహభాగం సంపన్నులవీ,  శక్తిమంతులవీ, రాజకీయ నాయకులవీఅయినప్పుడు,ఆక్రమణలను తొలగించే ప్రభుత్వ కార్యక్రమం కనీసం తటస్థంగా కనబడాలంటే ఎక్కువ దాడులు వారి మీద జరగాలి. ఆశ్చర్యకరంగా అతి తక్కువ దాడులు సంపన్నుల మీద జరుగుతున్నాయి. అవి కూడా వారిని బెదిరించి కప్పాలు సంపాదించడానికే జరుగుతున్నాయని,వాస్తవంగా వారి నుంచి భూమి స్వాధీనం చాలా తక్కువనీ విమర్శకులు అంటున్నారు. కాగా, ఆక్రమణల పేరు మీద దాడి పేద, మధ్య తరగతి వర్గాల మీద వారి ఆక్రమణల నిష్పత్తిని మించి జరుగుతున్నది. పెద్దలఆక్రమణ విలాసాల కోసం, ఆస్తి పోగు చేసుకోవడం కోసం, దాని నుంచిలాభాలు  సంపాదించడం కోసం కాగా, పేద మధ్యతరగతి వర్గాలు నిజంగా ఎక్కడైనా ఆక్రమించినా అది నివాసం కోసం, అనివార్య పరిస్థితుల్లో జరిగేది మాత్రమే. అది కూడా పెద్దల, సంపన్నుల, రాజకీయ నాయకుల సహాయంతో జరిగేదే.

గ్రామసీమల్లో ఉపాధి కరువై, ఏదో ఒక ఉపాధి వెతుకుతూ, స్థిరమైన ఉపాధి దొరకకపోయినా అడ్డాకూలీగా రోజువారీ జీవిక అయినా దొరుకుతుందనే నమ్మకంతో నగరానికి వలస వచ్చిన వేలాది మందికి నివాసస్థలం లేదు. ఎక్కడ ఖాలీ భూమి కనబడితే అక్కడ, మూసీ ఒడ్డున మురికిలో, మురికి వాడల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. వారి నివాసాలు కూడా రాజకీయ నాయకుల, బస్తీ నాయకుల పర్యవేక్షణలో, వారికి విపరీతంగా ముడుపులు చెల్లించి జరిగినవే. అటువంటి పేద వర్గాల మీద హైడ్రా దాడి చేసి, వారిని నిర్వాసితులను చేసింది. అలాగే, నగరంలో వృత్తులూ ఉపాధులూ పెరిగి చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించుకున్న మధ్య తరగతి దిగువ స్థాయి, మధ్య స్థాయి కుటుంబాలు వేలాదిగా నగరంలో నిండిపోయాయి. చిన్నస్థాయి బిల్డర్లు, డెవలపర్లు ఈ మధ్య తరగతిని ఆకర్షించి, తమ దగ్గర అన్ని అనుమతులూ ఉన్నాయని భ్రమలు కల్పించి, కొన్ని సందర్భాలలో అనుమతులు లేకుండానూ, కొన్ని సందర్భాలలో అవినీతి ద్వారా సంపాదించిన అనుమతులతోనూ, గృహ సముదాయాలు, భవనాలు నిర్మించారు. తల తాకట్టు పెట్టి ఆ ఇళ్లుకొనుక్కుని వాటిలో జీవిస్తున్నవారు ఇప్పుడు హఠాత్తుగా హైడ్రా కోరలకు బలి అయిపోయారు.

ఇలా మొత్తం ఎన్ని ఇళ్ల కూల్చివేత జరిగింది, ఎన్ని కుటుంబాలను నిర్వాసితులను చేయడం జరిగింది అని కచ్చితమైన గణాంకాలు లేవు గాని వేల ఇళ్ల కూల్చివేత, వేల కుటుంబాల నిర్వాసితత్వం హైడ్రా చలవ. ఇప్పుడు ఒక సంపన్న గృహ నిర్మాణ సంస్థ విషయంలో మందలింపు ఎదుర్కొన్న హైడ్రా, ఈ వేలాది పేదల విషయంలో బారా ఖూన్ మాఫ్ అన్నట్టే అభినందనలు పొందింది. హైదరాబాద్ లో అక్రమ భూ ఆక్రమణల గురించి, గృహ వసతి కొరత గురించి, సంపన్నుల భూదాహం గురించి, పేద, మధ్యతరగతి గృహ అవసరాల గురించి జరగవలసిన విస్తారమైన చర్చ, ఇప్పుడు హైడ్రా – హైకోర్టు – ప్రభుత్వం అనే అనవసరపు బెర్ముడా ట్రయాంగిల్ లో మునిగిపోతున్నది.

“ఇవి కచ్చితంగా విపత్తులే, ఉత్పాతాలే. వీటికి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించవలసి ఉంది. నిజానికి అదే ప్రధాన లక్ష్యం. మరి ఈ ఉత్పాతాలు ఎందుకు కలుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు, చాలా కారణాలు కనబడతాయి. గతంలో చెరువులుగా, కుంటలుగా, జలాశయాలుగా, కాలువలుగా ఉండినవి ఆక్రమణలకు గురై, లేఔట్లుగా మారి, జనావాసాలుగా రూపు మార్చుకున్నాయి. గతంలో కాలువలుగా నీరు ప్రవహించడానికి వీలుగా ఉండిన ప్రాంతాలు ఇప్పుడు కబ్జా అయిన సొంత ఆస్తులుగా నీటి ప్రవాహానికి అవరోధాలుగా మారిపోయాయి..”

హైడ్రా పేరు మీద జరుగుతున్న అక్రమాల గురించి, మితిమీరిన అధికార దుర్వినియోగం గురించి, ప్రకటిత లక్ష్యాలను ఉల్లంఘిస్తూ, ఏవో ప్రచ్ఛన్న ప్రయోజనాల కోసం పని చేయడం గురించి గతంలో ఈ శీర్షిక కిందనే చర్చించి ఉన్నాం. ఇప్పుడు హైడ్రా మరింత విస్తరించి అనేకసార్లు న్యాయ వ్యవస్థను ధిక్కరించడం, చివరికి న్యాయ వ్యవస్థ కూడా విసిగిపోయి హైడ్రాను, హైడ్రా కమిషనర్ ను తీవ్రంగా అభిశంసించడం, ఆ హైడ్రా అధికారిని కాపాడడం కోసం ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థనే ధిక్కరించడానికి ప్రయత్నించడం – మూసీలో చాలా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రారంభం నుంచీ హైడ్రా పని తీరు, ప్రత్యేకంగా దాని కమిషనర్, ఐపీఎస్ అధికారి ఎ వి రంగనాథ్ వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా ఉంటున్నాయి. నగరంలో పెరిగిపోతున్న భూఆక్రమణలను, ముఖ్యంగా చెరువుల, కుంటల, సాముదాయక ఆస్తుల ఆక్రమణను అడ్డుకోవడానికి,కబ్జాదారులను తొలగించి, ఆ భూమిని మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి తేవడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటయింది. ఉత్పాతాలకు, విపత్తులకు స్పందించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం దాని పేరులోనే ఉన్న రెండు లక్ష్యాలు.

నగరంలో ఉత్పాతాలు, విపత్తులు అన్నప్పుడు సాధారణంగా భూకంపాలు, తుపాన్లు వంటి ఉత్పాతాలకు ఎక్కువ అవకాశం లేదు గాని, మామూలుగా అందరికీ తెలిసిన ఉత్పాతం వర్షాకాలంలో విపరీతంగా వరదలు రావడం. మూసీ నది వెల్లువెత్తడం మాత్రమే కాక,నగరంలో చాలా రోడ్లు కాలువలుగా మారిపోతాయి. వందల సంవత్సరాలుగా జలాశయాలుగా ఉండి ఇప్పుడు జనావాస ప్రాంతాలుగా మారిపోయిన ప్రాంతాలు మళ్లీ తమ పూర్వజన్మ స్మృతులు తలపోసుకుంటాయి. అనేక లోతట్టు ప్రాంతాలలో రోజుల తరబడి నీరు నిలిచిపోతుంది. ఇవి కచ్చితంగా విపత్తులే, ఉత్పాతాలే. వీటికి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించవలసి ఉంది. నిజానికి అదే ప్రధాన లక్ష్యం. మరి ఈ ఉత్పాతాలు ఎందుకు కలుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు, చాలా కారణాలు కనబడతాయి. గతంలో చెరువులుగా, కుంటలుగా,జలాశయాలుగా, కాలువలుగా ఉండినవి ఆక్రమణలకు గురై, లేఔట్లుగా మారి, జనావాసాలుగా రూపు మార్చుకున్నాయి. గతంలో కాలువలుగా నీరు ప్రవహించడానికి వీలుగా ఉండిన ప్రాంతాలు ఇప్పుడు కబ్జా అయిన సొంత ఆస్తులుగా నీటి ప్రవాహానికి అవరోధాలుగా మారిపోయాయి. వరదలను గతంలో అడ్డుకోగలిగిన చిట్టడవులు,చెట్లు, మిట్టలు, కొండలు చదును చేయబడి, చిన్న చిన్న వరదలన్నీ మహానది లాగా వేగంగా కొన్ని మైళ్లపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగే అవకాశం దొరికింది. సహజంగా వాన నీరు, వరద నీరు భూమిలోనే ఇంకిపోవడానికి అవకాశం ఉండిన ప్రతిచోటా ఇప్పుడు రోడ్లతో,సిమెంటుతో తాపడం జరిగి ఎక్కడ ఒక చుక్క చిందినా అది మరెక్కడికో వరదగా వెళ్లక తప్పని స్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నైసర్గికత ధ్వంసమైపోయింది. ధ్వంసం చేయబడింది. నాలుగు వందల ముప్పై సంవత్సరాల నగర చరిత్రలో ఈ విధ్వంసం వయసు అటూ ఇటూగా ముప్పై, నలబై సంవత్సరాలు మాత్రమే.

దశాబ్దాలుగా జరిగిపోతున్న ఈ నేరానికి, పాపానికి బాధ్యులు అనేక మంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లంచగొండితనంతో ఎడాపెడా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాధికారులు. జీవితకాలంలో చిన్నపాటిదైనా ఒక ఆశ్రయం సంపాదించుకోవాలని తపన పడే పేద,మధ్యతరగతి వర్గాలు. హిరణ్యాక్షుడిలా భూమిని చాప చుట్టి దాని మీద తమ విలాసాలు అనుభవించాలనుకునే సంపన్నులు, శక్తిమంతులు,రాజకీయ నాయకులు. ఇందులో ఎవరి బాధ్యత ఎంతో ఇప్పుడు లెక్క తేల్చడం కష్టం గాని, తప్పనిసరిగా ఈ విధ్వంసాన్ని ఇప్పటికైనా అడ్డుకోవలసి ఉంది. సమాజమంతా ఆ విధ్వంసాన్ని ఆపడానికి పూనుకోవాలి. ప్రభుత్వం మరింత బాధ్యత చేపట్టాలి. కచ్చితమైన అధికారిక చర్యలు చేపట్టాలి. అందువల్లనే ఉత్పాతానికి స్పందన అనే మొదటి లక్ష్యం నుంచి సహజంగా ఆస్తుల పరిరక్షణ అనే రెండో లక్ష్యం తలెత్తింది. వ్యక్తిగత ఆస్తులనైతే ఎవరికి వారు రక్షించుకుంటారు గాని,సాముదాయక ఆస్తులను రక్షించేవారెవరూ ఉండరు. అందువల్ల ప్రభుత్వమే పూనుకుని సాముదాయక ఆస్తులను రక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు ఆమోదం కూడా దొరికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *