పైకి నీతిగా అందరు కలిసి ఉండాలని అంటూనే ఉంటారు. కాని చేసే పనులు ఏమంటే పెద్దలూ కాదు మనుషులూ కాదు అనిపిస్తుంది. ఒకవైపు బాధితులు, మరొక వైపు బాధించేవారు. ఇది చాలా అన్యాయం అంటే, కనీసం తెలంగాణ అనే మాట కూడా చెప్పకూడదనే నిషేధాలు ఉండేవారు. ఎంత ఉద్యమాలు జరుగుతున్న దశలో కూడా తెలంగాణ అంటే నేరమైపోయింది. చంద్రబాబునాయుడు వంటి పెద్దమనుషులతో ఏ ఒప్పందాలు చేసేదేమిటి? అన్నీ తప్పకుండా అంటారు. ఇక దానికి కారణాలేమిటి? ఉల్లంఘించడం కారణం. అయినా ఈ పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి కొన్ని సామాజిక, రాజకీయ కారణాలు రాసుకోవడానికి పనికి వస్తాయి. అవి:
| కారణం | వివరణ | |
| రాజకీయ ఆధిపత్యం | సంఖ్యాబలం పరంగా ఆంధ్ర నాయకులు అసెంబ్లీలో ఎక్కువగా ఉండటంతో,
నిర్ణయాధికారం వారి చేతుల్లోనే ఉండిపోయింది. |
|
| కేంద్రీకృత పాలన | పరిపాలన అంతా హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నా,
కీలక పదవులన్నీ (ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రధాన కార్యదర్శి) ఆంధ్ర వారికే దక్కడం వల్ల తెలంగాణ వాణి వినిపించకుండా పోయింది. |
|
| న్యాయపరమైన చిక్కులు | ముల్కీ నిబంధనలను కోర్టులలో సవాలు చేయడం వల్ల
అవి రాజ్యాంగ విరుద్ధమని తేల్చే ప్రయత్నం జరిగింది. ఇది తెలంగాణ హక్కులను దెబ్బతీసింది. |
|
| అవగాహన లోపం | ఒకే భాష మాట్లాడే వారంతా ఒక్కటే అన్న భావనతో
తెలంగాణ సంస్కృతిని, భౌగోళిక అవసరాలను ఆంధ్ర పాలకులు విస్మరించారు. |
ఈ ఉల్లంఘనల పర్యవసానం
ఈ ఒప్పంద ఉల్లంఘనలే మొదట 1969 తెలంగాణ ఉద్యమానికి దారితీశాయి. ఆ తర్వాత 1973లో వచ్చిన ‘ఆరు సూత్రాల పథకం’ కూడా తెలంగాణకు న్యాయం చేయలేకపోయింది. ఎందుకంటే దొంగ సర్టిఫికెట్లు, ద్రోహపూరిత జివోలు, రాజకీయ నాయకుల రహస్య ఒప్పందాలు, తెలంగాణ వారిని నాశనం చేసే ప్రయత్నాలు చేయడం అసలైన కారణాలు. ఈ చారిత్రక అన్యాయమే చివరకు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలోపేతం చేసి, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి పునాది వేసింది అనేక సందర్భాలలో జనధర్మ వారపత్రిక ద్వారా అంకెలద్వారా, సాంఘికంగానూ అనేక రకాలుగా వివరించింది.
పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా
అందరికీ తెలుసు తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం గురించి. ఆమాట వినగానే గుర్తు వచ్చేది సినిమా పాట: ‘‘పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి కాడురా, పెద్దమనిషి అంటేనే బుద్ధులన్ని వేరు రా’’ అని పరమానంద శిష్యుల కథ అనే చిత్రంలో చాలామందికి తెలుసు.
పాటలో మరికొన్ని నిజాలు కూడా కనపడతాయి.
‘‘పరమగురుడు చెప్పిన వాడు
పెద్ద మనిషి కాడురా,
పెద్ద మనిషి కాడురా, పెద్దమనిషి
అంటేనే బుద్ధులన్ని వేరు రా
‘‘గుట్టుగ వెనకాల చేరి గోతులు తీసేవాడు,
తిన్నగ రాత్రుళ్లు వచ్చి కన్నం వేసేవాడు
మాటలేమి లేకుండా ముటలు కట్టే వాడు
పెద్ద మనిషి వాడేరా పొట్టి మనిషి కాదురా (పరమగురుడు…)
దొంగ అంటే ఎవరురా, దొంగడు అనవలెనురా
డుములు చెప్పరా, వ్యాకరణం గొప్పరా
దొంగ వాడ్ని దొరలారా గౌరవించెదెట్టరా
ఎలారా? ఎలారా? (పరమగురుడు…)
తధిగిణ తకతకథోమ్ అని వీపు చిట్టగొట్టరా..
తెలంగాణ అనుభవం ఇదే.





పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!