వచ్చే వారం ‘హౌసింగ్‌’ భూముల విక్రయాలు

– చింతల్‌లో బహిరంగ వేలం ద్వారా విక్రయాలు
– కేపీహెచ్‌బీ, రావిర్యాలలోని భూములకు ఇ-వేలం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ (సోమవారం) నుంచి జీహెచ్‌ ఎంసీ పరిథి సహా పలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం నగరంలోని చింతల్‌, నిజాంపేట బాచుపల్లి ప్రాంతంలో ఉన్న 22 రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌, ఫ్లాట్స్‌ను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గత నెల 15న జారీ చేశారు. చింతల్‌ ప్రాంతంలో 18 ఎంఐజి, హెచ్‌ఐజి ప్లాట్లు, నిజాంపేట బాచుపల్లిలో 4 ఫ్లాట్లును బహిరంగ వేలం వేయనున్నారు. ఇటీవల కెేపీహెచ్‌బీ కాలనీ ప్రాంతంలో హౌసింగ్‌ బోర్డు పలు దఫాలుగా నిర్వ హించిన భూముల విక్రయాల్లో ఎకరా భూమి సుమారు రూ.70 కోట్లకు ఇ-వేలం ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెేపీహెచ్‌బీ కాలనీలో నాలు గు కమర్షియల్‌ ప్లాట్లను ఈనెల 7, 8వ తేదీల్లో ఇ-వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు. ఫేజ్‌-1, 2 పరిథిలో ఉన్న 6549 చదరపు గజాలతోపాటు, 2420 చ.గజాలు, 2397 చ. గజాలు, 726చ. గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌ లకు మంగళవారం నాడు ఇ-వేలం నిర్వహిస్తున్నారు. అలాగే నాంపల్లి ప్రాంతంలోని 1148 చదరపు గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ను కూడా 8 వ తేదీన ఇ-వేలం ద్వారానే విక్రయిస్తున్నట్లుగా హౌసింగ్‌ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు అక్టోబరు 9, 10 వ తేదీల్లో చింతల్‌ లోని 10,890 చదరపు గజాల కమర్షియల్‌ భూమి, మహేశ్వరం మండలంలోని రావిర్యాల ప్రాంతంలోని 13,503 చ.గ.లు, 5,953.20 చ.గ.లు, 3,630 చ.గజాల విస్తీర్ణంలోని భూములను కూడా ఇ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇవే కాకుండా వచ్చే పది రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని హౌసింగ్‌ బోర్డు ప్లాట్ల విక్రయానికి కూడా నోటిఫికేషన్‌ ఇచ్చారు. వీటిలో సంగారెడ్డి – సదా శివ పేటలోని ప్లాట్లు, జోగులాంబ గద్వాల,నిజామాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన భూములు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే వివిధ రకాల నోటిఫికేషన్లను హౌసింగ్‌ బోర్డు అధికారులు విడుదల చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page