హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్

-ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా తరుణ్ జోషి
– ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్I2 ఐజీగా షానవాజ్ ఖాసిం నియమితులయ్యారు. ఆయన పోలీసు పర్సనల్ ఐజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా తరుణ్ జోషి నియమితులయ్యారు. డ్రగ్స్ కంట్రోల్ డీజీగా అవినాష్ మొహంతిని నియమిస్తూ ఆయనకు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా బి.సుమతి, ఐజీ కార్తికేయకు ఎసఐబీ ఐజీగా అదనపు బాధ్యతలు
అప్పగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *