రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగ సందర్భంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో పలు ప్రాంతాల్లో హోలీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. డీజేల హోరు, బ్యాండ్ బాజాతో యువత సందడి చేస్తుంది.హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్స్, గ్రౌండ్స్‌లో హోలీ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. డిఫరెంట్ థీమ్స్‌తో ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈవెంట్స్ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తీరొక్క రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాన కూడళ్లలో డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు. ఇక చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరుపుకొని సంతోషం వ్యక్తం చేశారు. యువకులు డప్పు చప్పుళ్లతో వీధుల్లో తిరుగుతూ హోలీ వేడుకలు నిర్వహించారు.