భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్‌లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు
నేడు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయే అవకాశం
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో మూడురోజుల్లో ఉదయం పొగమంచే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఏడు ఏడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ 39 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాల సీజన్ ముగియడంతో.. జనవరి చివరి వారం నుంచే ఎండలు భారీగా పెరిగాయి. భానుడి ఉదయం నుంచే ప్రతాపం చూపిస్తుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు.
ఎండాకాలానికి ముందే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని పేర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు పెరుగుతుండడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా.. ఎండల్లో బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. బయటకు వెళ్లినా గొడుగులు వెంట తీసుకువెళ్లాలని.. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.