– ట్రాఫిక్ సర్వేను దృష్టిలో పెట్టుకోవాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల నిర్మాణాలు దశలవారీగా, త్వరితగతిన చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హ్యామ్ రోడ్ల నిర్మాణంపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణ క్రమంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని, రోడ్ల నిర్మాణ క్రమంలో ట్రాఫిక్ సర్వేను గమనంలో పెట్టుకోవాలని సూచించారు. మొదటి ఫేజ్‌కు అతి త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సి.ఎస్ వికాస్‌రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ హరిత, పలువురు ఆర్‌అండ్‌బి అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





