అధికారాన్ని అడ్డుపెట్టుకుని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కండిషనల్ సపోర్ట్ అంటుంది. అసలు తమిళనాడుతో కాంగ్రెస్ ఉనికే లేదు. అలాంటి పార్టీ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కండీషన్లు పెట్టుతుంది.మరోవైపు గోతికాడ నక్కలో చూస్తున్న బీజేపీ తమిళనాడులో తన మార్క్ రాజకీయాలు మొదలు పెట్టింది.ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్థతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకునే వ్యూహాలు స్టార్ట్ చేసింది.
తమిళ పాలిటిక్స్ ఎప్పుడూ దేశ రాజకీయాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి..దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా, డామినేషన్ చేసేలా ఉంటాయి.అదే సమయంలో ప్రాంతీయ అస్థిత్వం, ద్రవిడ ఆత్మగౌరవం కోసం కట్టుబడుతాయి.దశాబ్దాలుగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఆల్టర్నేటివ్ గా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి..రెండు కూడా తమిళ అస్థిత్వం కోసం, ఉత్తరాది పార్టీల అధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలే.
అయితే చాలా సందర్భాల్లో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఉత్తరాది, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలతో పొత్తులు పెట్టుకున్న చరిత్ర కళ్ల ముందు ఉంది.ఉత్తరాది పార్టీలతో అంటగాగిన ప్రాంతీయ ద్రావిడవాదాన్ని మాత్రం వదులు కోలేదు. ఇద్దరూ సినిమా రంగం నుంచి, ఒకే పార్టీ నుంచి వచ్చారు. ముందు ఎంజీ రామచంద్రన్ ఆ తరువాత జయలలిత, కరుణానిధిలు తమిళవాదంతో పని చేశారు.కానీ జయలలిత, కరుణానిధిల మరణం తర్వాత గత దశాబ్దంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు తమిళవాదం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.డీఎంకే తమిళవాదం కోసం కాస్తా కొట్లాడుతున్న జయలలిత మృతి తర్వాత ఏఐడీఎంకే మాత్రం పూర్తిగా ఉత్తరాది పార్టీకి లొంగిపోయింది.
దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతూన్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలపై తమిళ తంబిలకు విసుగొచ్చింది. ఇన్ని రోజులు ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడం, చిన్న చిన్న పార్టీలు వచ్చినా ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయాయి.తమ ఆకాకంక్షలకు నెరవేరుస్తుందన్న భరోసా వోటర్లలో కల్పించలేకపోయాయి. దీంతో తప్పని సరి పరిస్థితిలో ప్రజలు డీఎంకే, ఏఐడీఎంకేలో ఏదో ఒక పార్టీని గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఇదే అదునుగా రెండు పార్టీలు పవర్ షేరింగ్ చేసుకున్నాయి.అధికార మార్పిడులు చేసుకున్నాయి.
అయితే చాలా ఏళ్ల తర్వాత తమిళనాడులో ప్రాంతీయ అస్థిత్వం, ద్రావిడ ఆత్మగౌరవం ఉత్తరాది అధిపత్యం, రాష్ట్రంలో డీఏంకే,ఏఐడీఎంకేల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తు హీరో విజయ్ టీవీకే రూపంలో కొత్త రాజకీయ శక్తి పురుడు పోసుకుంది. విజయ్ పార్టీ కూడా చాలా పార్టీల్లాగానే కనుమరుగైతాయని తమిళ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీలు అనుకున్నాయి. కానీ విజయ్ పార్టీ తమిళనాడులో ప్రభంజనం సృష్టించారు. దశాబ్దాల రాజకీయ ఆనుభవం, ప్రాంతీ అస్థిత్వవాద పోరాట నేపథ్యం, బలమైన నాయకత్వ పునాది ఉన్న ప్రజలకు మంచి లక్ష్యం, స్పష్టమైన విజన్, జనాలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో పార్టీ పెట్టితే,నాయకుడిపై నమ్మకం ఉంటే ప్రత్యామ్నాయ పార్టీలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని తమిళనాడులో విజయ్ నిరూపించారు.
అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో అధిపెద్ద పార్టీగా, ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సునామీ సృష్టించి ద్వీపార్టీ కంచుకోటలు బద్దలు కొట్టారు. కోరలు తిరిగి,తలలు పండిన నేతలను ఎన్నికల్లో మట్టికరిపించారు. చరిత్రను తిరగరాసి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు.తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ సహా సిని గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టాలని అనేక మంది అనుకున్నారు.అందులో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇప్పుడు విజయ్ తప్ప పెద్దగా రానించలేదు.కొందరు పార్టీ పెట్టి చేతులు కాల్చుకుంటే, రజనీకాంత్ లాంటి వారు పార్టీ పెట్టాలని తర్వాత వెనక్కి తగ్గారు.
అయితే విజయ్ పార్టీ పెట్టాలని మొదట్లో అనుకోలేదు. విజయ్ పార్టీ పెట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకువచ్చాయి. విజయ్ కంటే ముందు రజనీకాంత్‌పై ఒత్తిడి చేసిన రజనీ కాంత్ పార్టీ పెట్టే ధైర్యం చేయలేకపోయారు. కానీ విజయ్ పార్టీ పెట్టి చాలా తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యారు.టీవీకే ఏర్పాటు వెనుక విజయ్ అనేక పురుటి నొప్పులు అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పక్షపాత రాజకీయాలే విజయ్‌ను పార్టీ పెట్టేలా చేశాయి. మొదటి నుంచి విజయ్ పై బీజేపీ కక్ష సాధింపు చర్యలే కొనసాగించింది. పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆ మాటకు వస్తే పార్టీ పెట్టడానికి కూడా కక్ష సాధింపు చర్యలే కారణం. విజయ్ సినిమాలో ఏదో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే పాత్రలు, డైలాగులు ఉన్నాయని కక్షగట్టిన కేంద్రం అప్పటి నుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వేధింపులే చివరకు విజయ్ పార్టీ పెట్టేలా చేసింది.ఆ వేధింపులే, విజయ్ సినిమాలపై కక్ష సాధింపు చర్యలు, చివరికి విజయ్ కుటుంబాన్ని కూడా రాజకీయాలకు వాడుకుని కక్ష సాధింపు చర్యలు దిగారు.ఆ వేధింపులే విజయ్ టీవీకే గెలుపులో టర్నింగ్ పాయింట్ అయింది.ఆ వేధింపులే తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభంజనానికి కారణమైంది. ఆ వేధింపులే ఎన్నికల్లో విజయ్ సునామీ సృష్టించడానికి కారణమయ్యింది.ఆ వేధింపులే యువతలో విజయ్ పై నమ్మకాన్ని పెంచేలా చేసింది.
పార్టీ పెట్టినప్పుటి నుంచి ఎన్నికలు పోలింగ్ ఫలితాల ముందు దాకా ఆ వేధింపులే విజయ్ తో జెన్ జీ ర్యాలీ కావడానికి అన్నింటి కంటే ముఖ్యమైన కారణమైంది. ఇప్పటీకీ విజయ్‌పై ఆ వేధింపులే ఫలితాల తర్వాత కొనసాగిస్తున్నారు.డీఎంకే, ఏఐడీఎంకు మట్టి కరిపించి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి సంచలన విజయం టీవీకే సృష్టించింది. అయిన విజయ్‌పై ఇటు డీఎంకే,ఏఐడీఎంకే పార్టీలే కాదు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కండిషనల్ సపోర్ట్ అంటుంది. అసలు తమిళనాడుతో కాంగ్రెస్ ఉనికే లేదు. అలాంటి పార్టీ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కండీషన్లు పెట్టుతుంది.మరోవైపు గోతికాడ నక్కలో చూస్తున్న బీజేపీ తమిళనాడులో తన మార్క్ రాజకీయాలు మొదలు పెట్టింది.ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్థతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకునే వ్యూహాలు స్టార్ట్ చేసింది. అఫ్ కోర్స్ ఈ పరిస్థితి కల్పించిందే బీజేపీ. ఇప్పుడు తమిళనాడులో అల్లర్లు జరిగే చాన్స్ ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు చేస్తూ తమిళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, పార్టీల క్యాడర్‌ను ప్రోవకేట్ చేసి, రాష్ట్రపతి పాలన పెట్టి తన గ్రౌండ్ సిద్దం చేసుకునే కుట్రలు చేస్తుంది.
.అయితే విజయ్‌పై వేధింపులే పార్టీ ఏర్పాటుకు ఒక రకం కాగా, డీఎంకే, ఏఐడీఎంకేపై వ్యతిరేకత పెరగడం మరో కారణం.అయితే విజయ్ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో మ్యాండేటరీ ఇచ్చారు. మిగతా రెండు పార్టీల కంటే రెండు రేట్లు ఎక్కువ మద్దతు ఇచ్చారు. అయితే విజయ్‌కు ప్రజలిచ్చిన విక్టరిని జాతీయ పార్టీలు, వాటితో పొత్తుల్లో ఉంటూ కూటములకు విజయ్ గెలుపును జీర్ణించుకోకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అడ్డంకులు సృస్టించే కుట్రలు చేస్తున్నారు.
రాజకీయాల్లో “శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నట్లు, ఉమ్మడి శత్రువును ఓడించేందుకు ఆగర్భ శత్రువులు కూడా స్నేహా గీతాలు పాడుకున్నారు.తెర వెనుక పావులు కదుపుతూ విజయ్‌ను ఇబ్బందులు పెట్టుతూ వేధింపులు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులు ఇలాగా కొనసాగితే విజయ్ గెలుపు ఒక్క తమిళనాడుకే పరిమితం కాదు. తమిళనాడులో పుట్టిన తుపాను దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి అది ప్రజాస్వామ్యం..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ బల నిరూపణ చేసుకోవాలి, అది చట్టం. ఒకవేళ ఒకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి, మెజారిటీ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. కానీ ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
అసెంబ్లీలో మెజారిటీ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది.. కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుంది.కానీ ఇప్పుడు విజయ్ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వనించకపోడం ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకం.ఇది ఒక రకంగా కక్ష సాధింపు చర్యలే. విజయ్ గెలుపును జాతీయ పార్టీలు జీర్ణించుకోక పోవడమే.రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని టీవీకే గవర్నర్‌ను కలిసింది.తమ ఎమ్మెల్యేల మద్దతు లిస్ట్‌ను ఇచ్చారు. ఇది చాలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు. కానీ గవర్నర్ ఏదో దురుద్దేశ్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు సంఖ్య బలం లేదనే సాకును తెరపైకి తీసుకువచ్చారు. సంఖ్య బలం ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దం.
అంతేకాదు, ఎవరి కోసమే, ఎవరో వస్తారనో, ఎవరి ఆదేశాల మేరకే టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వనించడం లేదని,దానికి సంఖ్య బలమనే కారణం చెపుతున్నట్లు క్లీయర్‌గా అర్థమైతుంది.డీఎకేం, లేదా, ఏఐడీఎంకే పార్టీలు వస్తాయని,లేదా ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పొత్తు పెట్టుకుని పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఒప్పందంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని తన దగ్గరకు వస్తారని బహుశ గవర్నర్ అనుకుంటున్నారు కావోచ్చు లేదా, దిల్లీ నుంచి అలాంటి సంకేతాలు ఉండవచ్చు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం చేస్తే క్యాంప్ రాజకీయాల్లో చక్రం తిప్పి తన అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆదేశాలు హస్తిన నుంచి అంది ఉండచ్చు. ఒకసారి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉత్తరాది కుట్రలు పని చేయవు.అందుకే విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.
గవర్నర్ చెప్పిన అంశాలనే గమనిస్తే, ఇప్పుడు తమిళనాడు ఏ పార్టీకి సింగిల్ మెజారిటీ లేదు. పార్టీ ఫిరాయింపులు మినహా ప్రజలు గెలిపించే అవకాశం లేదు. అలా అయితే ఏ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యండి అని గవర్నర్ ఆహ్వానిస్తారు.?.మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు, కేంద్రానికి సిఫార్సు చేస్తారా.?. అప్పటి దాకా రాష్ట్రపతి పాలన పెట్టుతారా.?.ఆ మేరకు కేంద్రాని సిపార్సు చేస్తారా.?దీనికి రాజ్యాంగం అంగీకరిస్తుందా.?.ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం.?.గవర్నర్ ఆఫ్ తమిళనాడు ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి. ఆ తర్వాత అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం విజయ్ ఎలా ఎదుర్కొంటారో. గట్టేక్కుతాడో తెలుస్తుంది. కక్షపూరిత రాజకీయాల్లో రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయకండి..అంతేకానీ తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే కుట్రలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యం కావద్దు.
మరోవైపు తమిళనాడులో ఎన్డీయే కూటిమిలో ఏఐడీఎంకే, ఇండి కూటమిలో డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఊహగానాలు వస్తున్నాయి.నిప్పులేనిదే పొగరాదన్నట్లు దిల్లీలో ఆ చర్చలు జరుగుతుండవచ్చు. అందుకే గవర్నర్ వ్యవహరశైలి అలా ఉండవచ్చు..ఏదీ ఏమైనా బంతిని గోడకు ఎంత గట్టిగ కొట్టితే అంతే బలంగా తిరిగి వస్తుందన్నట్లు విజయ్‌ను ఎంత తొక్కితే అంతే రాజకీయంగా అంత రాటుదేలుతాడు.పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో సంచలన గెలుపు ఒక ఉదాహరణ.
.ఇప్పటికే ఎన్నిక ముందు, ఎన్నికలు జరుగుతుంటే విజయ్‌ను కేంద్రం వేధించింది. పార్టీ ఏర్పాటు నుంచి కుటుంబం, వ్యక్తిగత విషయాల వరకూ అన్నింటీని అస్త్రంగా మార్చకుని వేధించింది.అయితే విజయ్ నిజాయితీ, ప్రజల్లో ఉన్న నమ్మకం ముందు ఆ కుట్రలు పని చేయలేదు. వోట్ల రూపంలో ప్రజలు తిప్పికొట్టారు.
.ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తునే మరోవైపు ప్రమాణస్వీకారానికి ముందే కేసులు వేస్తూ వేధిస్తుంది.అయితే విజయ్‌ను ఎంత వేధింపులకు గురి చేస్తే టీవీకేకు అంత ప్రజా మద్దతు పెరుగుతుంది. గోడకు కొట్టిన బంతిలా అంతే బలంగా వస్తారు. తమిళనాడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు.ఉత్తరాది పార్టీ ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించని తంబీలు ఇప్పుడు ఏఐడీఎంకే, డీఎంకే, గవర్నర్‌ను ముందు పెట్టు చేస్తున్న చిల్లర రాజకీయాలు దగ్గర గమనిస్తున్నారు..ఇది విజయ్ కు అదనపు బలాన్నిస్తుంది.
అటు డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల పొత్తు వార్తలు కూడా విజయ్‌కు మరింత బలాన్నిస్తుంది..మరింత ప్రజా మద్దతును పెంచుతుంది..ఇండి కూటమిలో ఉన్న డీఎంకే, ఎన్డీయే కూటమిలో ఉన్న ఏఐడీఎంకేలు కలిసి విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేసి ఆ పార్టీలే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది విజయ్‌కు మరింత బలాన్ని ఇస్తుంది.ఆ రెండు పార్టీలు ఉత్తరాది పార్టీలు, తమిళ వ్యతిరేక విధానాలతో పని చేస్తున్నాయనే విజయ్‌ను గెలిపించారు ఇప్పుడు ఆ రెండు పార్టీలే ఏకమైతే భవిష్యత్‌లో ఆ పార్టీలకు తమిళనాడు ప్రజలు రాజకీయ సమాధి కట్టుతారు అంత ప్రాంతీయాభిమానం తంబీలది.
ఇంకోవైపు విజయ్ సునామీ ప్రస్తుతానికి తమిళనాడు వరకే పరితమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసుకుండా ఇంకా కేంద్రం వేధిస్తే అది దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది.ఆ తుపాన్ ముందు బహుషాలు మోదీ షాలు కూడా నిలవకపోవచ్చు. వేయి ఏనుగులు తిన్న రాబందు ఒక్క గాలి వానకు కూలినట్లు, దేశంలో ప్రాంతీయ ప్రభుత్వాలను కూల్చుతూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీల విజయ్ సృష్టించే గాలి వానలో కూలిపోయిన ఆశ్చర్యం లేదు.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా గవర్నర్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన, లొసుగులతో ఆలస్యం చేసిన అది విజయ్‌కు మంచే చేస్తుంది.అంతేకాదు ఒకవేళ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, బయట వస్తున్న వార్తల ప్రకారం డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా విజయ్‌కు తమిళనాడులో నష్టం జరగవచ్చు.ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షంలో కూర్చొచ్చు.కానీ దీర్ఘ కాలంలో అది విజయ్‌ను జాతీయ స్థాయిలో రియల్ హీరోను చేస్తుంది. ఆ స్థాయిలో విజయ్‌కు దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది.సానుభూతి పెరుగుతుంది. ఒకసారి ప్రజల్లో సానుభూతి, మద్దతు పెరిగితే అది దేశ రాజకీయాల్లో విజయ్ రూపంలో మరో చరిత్ర నమోదైతుంది.
ఇక తమిళనాడు కమ్యూనిస్టు పార్టీ విజయ్‌కు మద్దతు ఇవ్వమని కుండబద్దలు కొట్టారు.అది వారి కమిట్‌మెంట్.నమ్మిన సిద్దాంతం ఇచ్చిన మాట మీద నిలబడే తత్వానికి నిదర్శనం.కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చిన తాము మాత్రం డీఎంకేతోనే ఉంటామని ప్రకటిండం వారి మిత్ర ధర్మం..కాంగ్రెస్ మిత్ర ధర్మం పాటించకుండా డీఎంకేకు వెన్నుపోటు పొడిచిన కమ్యూనిస్టులు డీఎంకేతో నిలబడ్డారు.
.అయితే ఇప్పుడు డీఎంకే, ఏఐడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు కమ్యూనిస్టులు ఎవరి వైపు నిలబడుతారో స్పష్టత ఉండాలి. ఏఐడీఎంకే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి, డీఎంకే ఏఐడీఎంకేతో పొత్తు అంటే అది రాజకీయ వ్యభిచారమే అవుతుంది. అలాటప్పుడు లెఫ్ట్ పార్టీలు ఎటువైపో తేల్చుకోవాల్సి ఉంటుంది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు డీఎంకే, ఏఐడీఎంకే అనైతిక కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వామ్యం అంతకంటే దిగజారుడు ఉండదు..ఏదీ ఏమైనా విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఎంత వేధించినా, లేదా పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా ఏదీ చేసిన అది విజయ్ ని మరింత బలమైన లీడర్‌గా, రియల్ హీరోగా ప్రజలు గుర్తిస్తారు. గుర్తించడమేకాదు మోదీ కి ప్రత్యామ్నాయ నేతగా చూసిన ఆశ్చర్యం లేదు
-తోటకూర రమేష్





