– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటన
సిద్దిపేట,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: సిద్దిపేట జిల్లా కోహెడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మంత్రి పొన్నం డియాతో మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నదని.. కొట్టుకుపోయిందని అన్నారు. వర్షాలకు రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయని చెప్పారు. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని.. హుస్నాబాద్‌లో పర్యటించాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశామన్నారు. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హా ఇస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలని.. ఇక్కడ పర్యటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని బాధ్యతగా రైతులను ఆదుకుంటామని హా ఇచ్చారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు ప్రజల మధ్యే ఉండి నష్టపోయిన పంటలను అంచనా వేయాలని, భారీ వరదలకు జరిగిన నష్టాన్ని మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి పొన్నంపేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





