మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి

– ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సాధికారత, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. మహిళల ఆర్థిక, విద్య, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ బంజారా భవన్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగిింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వెంకట బాల్మూరి, జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సభకు విచ్చేసిన ప్రముఖులు అభినందించారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులతో మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *