బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నందున మహిళా శిశు సంరక్షణ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది వాటి నివారణకు కృషి చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సూచించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య, సక్షమ్ అంగన్‌వాడీ కార్యక్రమాలపై శనివారం రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షురాలు సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం మహిళలు, పిల్లల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. అలాగే పిల్లల రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడం, పిల్లలపై జరుగుతున్న దుర్వినియోగం, పోక్సో కేసులను తగ్గించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబంధించిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు అత్యుత్తమ సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు.  కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు ఎన్.మోతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారులు  జిల్లా బాలల పరిరక్షణ అధికారులు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మర్రిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందన గౌడ్, ప్రేమలత అగర్వాల్, గోగుల సారిత, బుర్కా వచన్ కుమార్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *