సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌  ఆరోగ్యంపై ఆందోళన

– అతడిని కాపాడాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూదిల్లీ, జూలై 16: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌  ఆరోగ్యంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆరోగ్యాన్ని కాపాడాలని ఆదేశించింది. రెండు వారాలకుపైగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత నెలాఖరులో దీక్ష ప్రారంభించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దాంతో దిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో వైద్య చికిత్స అందించాలని గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతిపౌరుడి ప్రాణం అమూల్యమైంది. అలాంటి ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. మరో 48 గంటలు ఈ నిరాహారదీక్ష ఇలాగే కొనసాగితే 59 ఏళ్ల వాంగ్‌చుక్‌ ‌ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. వాంగ్‌చుక్‌ ‌గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన పిటిషనర్‌.. ఆయనకు బలవంతంగా ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. 19 రోజులుగా వాంగ్‌చుక్‌ ‌దీక్ష చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన 9 కేజీల వరకు బరువు తగ్గారని వైద్యనిపుణులు చెప్తున్నారు. తాజాగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నా ఆరోగ్యం క్షీణించిన మాట వాస్తవమే. కానీ అత్యంత ప్రమాదకర స్థితికేం దిగజారలేదు. నిరాహార దీక్ష విరమించాలని నన్ను అడగడానికి బదులు జులై 20న ’చలో సంసద్‌’ ‌పేరిట పార్లమెంట్‌ ‌వరకు నిర్వహించే శాంతియుత మార్చ్‌లో భాగం కావాలని మద్దతుదారులను ఆయన కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *