హైదరాబాదు, ప్రజాతంత్ర,డిసెంబరు 6: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ఘంటా చక్రపాణిని ప్రభుత్వం నియమిం చింది. ప్రగతిశీల ఉద్యమాల విద్యార్థిగా మొదలైన ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని తనదైన ముద్రను సంపాదించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రం ఆచార్యులుగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా నిర్వహించారు.
తెలంగా ణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాల యాలకు ఉపకులపతులను నియామకం జరిగింది. ఈ క్రమంలోనే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ నియా మకం విషయంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కి ఇస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. మిగతా అన్ని యూనివర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియ పూర్తయినప్పటికి కేవలం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని పెండింగ్‌లో ఉంచడంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఎట్టకేలకు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆమోద ముద్ర వేసింది. కాగా చక్రపాణి ఈ పదవీలో ముడేళ్లపాటు కొనసాగుతారు.