– తుపాకీ లాక్కుని పారిపోతుండగా కాల్పులు
రాంచీ, ఆగస్టు 3 : ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోతుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ధన్‌బాద్ జైలు నుంచి సాహిబ్‌గంజ్ మండల్ జైలుకు తరలిస్తుండగా శనివారం రాత్రి హైవేపై ఈ ఘటన జరిగింది. నాలుగు పోలీసు వాహనాల ఎస్కార్ట్‌తో అతడిని తరలిస్తుండగా జమ్‌తారా పోలీస్ స్టేషన్ పరిధిలోకి కాన్వాయ్ వచ్చేసరికి తాను మరుగుదొడ్డికి వెళ్లాలని అతడు కోరాడు. వాహనాలు ఆపిన సమయంలో అతడు తుపాకీ లాక్కుని చీకట్లోకి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. తమపై కాల్పులు కూడా జరిపాడన్నారు. స్వీయ రక్షణ కోసం తామూ కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. అతడు ఘటనా స్థలంలోనే మరణించినట్టు అక్కడికి వచ్చిన మెడికల్ టీమ్ ప్రకటించింది. జమ్‌తారా ఎస్పీ శంభు కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఝార్ఖండ్‌లో సిన్హాపై అనేక కేసులు ఉన్నాయి. బలవంతపు వసూళ్లు, హత్య, హత్యాయత్నం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలు గ్యాంగులతో జట్లు కట్టి నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడని పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



