– విద్యతో ఏదైనా సాధించవచ్చు
– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫెరియా వై ఫియాస్టా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ప్రో వైస్ ఛైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా శ్రీధర్బాబు హజరయ్యారు. ముందుగా డీపీఎస్ విద్యార్థు లు జాతీయ గీతాలాపన చేయగా అనంతరం మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ కొమరయ్య, ప్రిన్సిపల్ తురగ పద్మజ్యోతి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి, మాక్ పార్లమెంట్, సాంప్రదాయ కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “ఫెరియా ఫియాస్టా లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి ముందుగా అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి సేవ చేసేవారిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో దొహదపడతాయని అన్నారు. మారుతున్న కాలానికి, టెక్నాలజీకి అనుకూలంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే మహోత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ గా రూపుదిద్దుకుంటారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని. విద్యతో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు.రైజింగ్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో వందలాది కంపెనీలు పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఐటీ, ఇండస్ట్రీయల్ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఏఐలో ఎన్నో సరికొత్త టెక్నాలజీలు రోజురోజుకి అప్ డేట్ అవుతున్న తరుణంలో విద్యార్థులు సైతం కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ తోపాటు మారుతున్న కాలానికి , టెక్నాలజీకి అనుకూలంగా నాలెడ్జ్ ను సంపాదించుకోవాలి అని అన్నారు. కొమరయ్య మాట్లాడుతూ ఫెరియా ఫియాస్టా వేడుకల్లో భాగంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్ లాంటి కార్యక్రమం విద్యార్థులను రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి సహయపడతాయి. ఈరోజు విద్యార్థులే రేపటి తరానికి రాజకీయ నేతలుగా మారతారు. మాక్ పార్లమెంట్ కార్యక్రమం అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయి. ప్రజల సమస్యలపై ఎలాంటి చర్చ జరుగుతుంది. దేశ ప్రజలకు అవసరమైన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతోపాటు చట్టాలు రూపకల్పన లాంటి పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తాయి. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో రేపటి రోజున గొప్ప గొప్ప నాయకులుగా తయారయ్యేవాళ్లు, కాబోయే వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కేవలం విద్యను మాత్రమే కాకుండా క్రీడా, రాజకీయ, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీని విద్యార్థులకు అందజేస్తూ గొప్ప పౌరులుగా తీర్చి దిద్దుతుందని అన్నారు. ప్రిన్సిపల్ తురగ పద్మజ్యోతి మాట్లాడుతూ డీపీఎస్ నాచారం విద్యకే కాదు ..అన్ని విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. విద్యతోపాటు సాంకేతిక, క్రీడాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనేక అంశాల్లోనూ మెళకువలను నేర్పించి రాష్ట్ర, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే భావి నిర్మాతలుగా తయారు చేస్తుందన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ,ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





