దేశీయ మైనింగ్‌ రంగంలో మరింత పురోగతి

ఆఫ్‌ షోర్‌ మినరల్స్‌ బ్లాక్స్‌ వేలం చారిత్రక ఘట్టం: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 28 :  దేశంలో మొట్టమొదటిసారి ఆఫ్‌ షోర్‌ ఏరియా మినరల్‌ బ్లాక్స్‌ వేలం నిర్వహిస్తుండడం చారిత్రక ఘట్టమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా.. ఆఫ్‌షోర్‌ మినరల్స్‌ బ్లాక్స్‌ వేలం కార్యక్రమం సందర్భంగా.. దిల్లీలోని అశోకా హోటల్‌ లో జరిగిన కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలో ఆఫ్‌ షోర్‌ మైనింగ్‌ లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్నారు. ప్రధానమంత్రి మోదీ దార్శనికతకు అనుగు ణంగా ముందుకెళ్తున్నామని,  బ్లూ ఎకానమీ ద్వారా గ్రీనర్‌ ప్లానెట్‌ సాధ్యమని మోదీ తరచూ చెబుతున్నారని, ఆఫ్‌ షోర్‌ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ యాక్ట్‌ 2002 ను 2010 లో వినియోగంలోకి తీసుకొచ్చారని,  కానీ ఆ తర్వాత 13 ఏళ్లపాటు లిటిగేషన్లు, ఇతర సమస్యల కారణంగా వేలం జరగలేదని అన్నారు. భారతదేశంలో 21 లక్షల ఎకరాల ఆఫ్‌ షోర్‌ మినరల్‌ కెపాసిటీ ని ఎక్స్‌ ప్లోర్‌ చేశామని,  దీని ద్వారా వికసిత్‌ భారత దిశగా భారతదేశపు మైనింగ్‌ రంగం మరింత పురోగతి సాధించనుందన్నారు.

ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు.. ఆఫ్‌ షోర్‌ మైనింగ్‌లో పనిచేస్తున్నాయి. ఇవాళ్టి నుంచి భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది. నేడు రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎక్విప్‌ మెంట్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరగనుంది.  తదనుగుణంగా.. ఇందులో వినియోగించే.. లిథియం, కోబాల్ట్‌, నికెల్‌.. తదితర క్రిటికల్‌ మినరల్స్‌ డిమాండ్‌ పెరగనుంది.  అంతర్జాతీయ ఏజెన్సీల అంచనాల ప్రకారం.. 2030 నాటికి ఆఫ్‌ షోర్‌ మినరల్స్‌ మార్కెట్‌ దాదాపు లక్షకోట్లకు చేరనుంది. మనం వివిధ క్రిటికల్‌ మినరల్స్‌ ను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఇది భారతదేశానికి ఓ సవాల్‌, ఓ అద్భుతమైన అవకాశం కూడా. క్రిటికల్‌ మినరల్‌ రంగంలో మనం ఆశాకిరణంగా ముందడుగు వేసేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి అని కిషన్‌ రెడ్డి తెలిపారు. భారతదేశంలో చాలా త్వరగా.. క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ ప్రారంభించుకోనున్నామని,  ప్రభుత్వ పీఎస్‌ యూ కాబిల్‌ ద్వారా విదేశాల్లోని క్రిటికల్‌ మినరల్స్‌ ఎక్స్‌ ప్లొరేషన్‌ యాక్టివిటీని ప్రారంభించాయి.  అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్స్‌ తీసుకుని ఎక్స్‌ ప్లొరేషన్‌ చేస్తున్నాం.

ఇతర దేశాలతోనూ చర్చిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం.. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌..  క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ ను ప్రకటించారు.  ప్రకటించిన.. 5 నెలల్లోనే.. ఈ దిశగా మేం కీలకమైన ముందడుగేశాం. రానున్న రోజుల్లో ఈ దిశగా మరిన్ని ట్రాంచెస్‌ లో వేలం వేయనున్నాం. ప్రభుత్వ పీఎస్‌ యూలతోపాటు.. ప్రైవేట్‌ సంస్థలను భాగస్వాములు చేసి ఈ రంగాన్ని మరింత ఉత్తమ ఫలితాలకోసం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం సంస్కరణలు తీసుకొచ్చాం.  పారదర్శకంగా మినరల్‌ బ్లాక్స్‌ వేలం కారణంగా.. రాష్ట్రాల రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగింది.

2004-2015 వరకు రాష్ట్రాల రెవెన్యూ.. 60 వేల కోట్లుంటే.. 2025-2024 వరకు ఇది 2.54 లక్షల కోట్లకు పెరిగింది.  అంటే దాదాపు నాలుగు రెట్లు రెవెన్యూ రాష్ట్రాలకు పెరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ముందు..మరింత పురోగతి సాధిస్తాం. మన దగ్గర మైనింగ్‌ రంగంలో వివిధ విభేదాలకు సంబంధించి.. విస్తృతమైన అనుభవం ఉంది. జీఎస్‌ఐ అనుభవ.. ప్రైవేటు రంగం సృజనాత్మకతను సమ్మిళితం చేసి ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.  మీ అందరి సహకారంతో.. బ్లూ ఎకానమీ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆత్మనిర్భర భారత నిర్మాణంలో, వికసిత భారత నిర్మాణంలో ముందుకెళ్దాం అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page