ఇంకా అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులు

– గణపతి, సంతోష్, రత్నాబాయి, వార్త శేఖర్
– తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారని పోలీస్ శాఖ వివరించింది. సాయుధ పోరాటం విరమించి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఇప్పటికే మావోయిస్టులకు డీజీపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటుతోపాటు పునరావాస విధానం ద్వారా లభించే ప్రయోజనాలు పొందాలని మావోయిస్టులకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. మరోవైపు కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్ సందర్భంగా సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎలఓసీ కమాండర్ రూపీ రెడ్డి అలియాస్ రంగబోయిన భాగ్య (46) మరణించారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ఆమె స్వస్థలం. రెండు దశాబ్దాలుగా ఆమె అజ్ఞాతంలో ఉంటున్నారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆమెపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఆమె మృతదేహానికి ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. మంగళవారం సాయంత్రం ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. బుధవారం రూపీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
—————————————————————————————————————————————————————————————-తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *