వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు స‌హాయం

– న‌ష్టం వాటిల్ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డ‌తాం
-ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హామీ

వ‌రంగ‌ల్, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధిత కుటుంబాలకు  స్థానిక  శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. వరదల వల్ల ఇళ్లు, జీవనోపాధి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు 2000 కుటుంబాలకు అవసరమైన రేషన్ సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 11వ డివిజన్‌లో జరిగిన పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన సుమారు 500 కుటుంబాలకు రేషన్ సరుకులు స్వయంగా అందజేశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకొని, ప్రభుత్వం మరియు తమ వంతు సహాయం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ, అది సరిపోదన్న ఉద్దేశంతో ఆయ‌న  నెస్టిల్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఈ చొరవకు స్పందించిన నెస్టిల్‌ సంస్థ సహకారంతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page