చేప మందు పంపిణీ షురూ

– ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్
– భారీ బందోబస్తు ఏర్పాటు
– పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును పరిశీలించారు. సీపీతోపాటు జాయింట్ సీపీ తఫ్పీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీన్ జోయల్ డేవిస్, గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ ఉన్నారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్  చేప మందు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో నాంపల్లి మెట్రో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా వైద్య, అగ్నిమాపక శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. చేప ప్రసాదం కోసం వచ్చిన వారి కోసం మూడుహెల్త్ క్యాంపస్‌ల‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం 5 అంబులెన్సులను సిద్ధం చేశారు. అస్వస్థతకు గురైన వారికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించనున్నారు. అవసరమైతే ఉస్మానియా హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బందితో హెల్త్ టీమ్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండనుంది. భద్రతా చర్యల్లో భాగంగా మూడు ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. భారీ జనసందోహం నేపథ్యంలో ప్రత్యేక అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను అధికారులు కల్పించారు.చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున లక్షకుపైగా చేప పిల్లల ఏర్పాటు చేశారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే దాదాపు 50 వేల మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచే క్యూలైన్లలో ఉండనున్నారు. ముహూర్తం రాత్రి 9 గంటల 1
నిమిషానికి చేప మందు పంపిణీ ప్రారంభ‌మైంది. ఉబ్బసం, ఆస్తమా బాధితులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లతో అధికారులు సిద్ధమయ్యారు. నాంపల్లి పరిసరాల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనలు విధించారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. 

 

ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది హైదరాబాద్ చేరుకున్నారని వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెయ్యిమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. భద్రతా చర్యలను గోల్కొండ డీసీపీ ్కండ డీసీపీ చంద్ర మోహన్ పర్యవేక్షిస్తారని చెప్పారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వివిధ భాషల్లో సూచనలు. సమాచారాన్ని అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో నివసించే వారు రద్దీని దృష్టిలో ఉంచుకుని వీలైతే మంగళవారం వచ్చి చేప ప్రసాదం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ సరిపడా చేప ప్రసాదం అందుబాటులో ఉందని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఎన్జీవో సంస్థల వద్ద కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *