హర్ ఘర్ తిరంగాతో ఉప్పొంగుతున్న దేశ భ‌క్తి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న శుభసందర్భాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన తిరంగా యాత్రలో యువత, ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కుటుంబ సమేతంగా మువ్వన్నెల జాతీయ జెండాను గర్వంగా, ఉత్సాహంగా ఎగురవేయాలని, తిరంగా యాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్ల అమూల్యమైన త్యాగాల పునాదులపైనే నేటి సగర్వ భారత్ నిర్మాణం జరిగిందని రామచందర్ రావు పేర్కొన్నారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 14న ట్యాంక్ బండ్‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు నిర్వహించనున్న తిరంగా యాత్రను పవిత్రమైన దేశభక్తి కార్యక్రమలో రాజకీయాలకు అతీతంగా ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *