పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణకు ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టు

– ఎక్స్ ‌వేదికగా స్పందించిన ప్రధాని మోదీ

న్యూదిల్లీ, జూలై 23: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై కాక్రోచ్‌ ‌జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణ కోసం ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి ఎక్స్ ‌వేదికగా తెలిపారు. పేపర్‌ ‌లీక్‌ ‌ఘటనల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అలాగే మన యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ’మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే.. ఏదీ ముఖ్యం కాదు! పేపర్‌ ‌లీకేజీల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు మేము తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది భాగం. యువత భవిష్యత్తును దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టేది లేదు’ అని ప్రధాని చెప్పారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే : రాహుల్‌, అభిజిత్‌ ‌

నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీపై దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్‌ ‌జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేపర్‌ ‌లీకేజీ బాధ్యులపై ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని గురువారం ఉదయం ప్రధాని మోదీ ఎక్స్ ‌వేదికగా తెలిపారు. అయితే ప్రధాని మోదీ ట్వీట్‌పై లోక్‌సభ విపక్ష నేత, సీజేపీ గట్టి కౌంటర్‌ ఇచ్చాయి. విద్యార్థుల జీవితాలను దెబ్బ తీసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌పై రాహుల్‌ ‌గాంధీ ఘాటుగా స్పందించారు.విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌విద్యార్థులకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. నేరానికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ‌చేశారు. మరోవైపు సీజేపీ కూడా మోదీ ప్రకటనపై దీటుగా స్పందించింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌నైతక బాధ్యత వహిస్తూ రాజీనామ చేయాలన్నారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేసింది. తమ డిమాండ్స్ ‌నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *