కాంగ్రెస్ వంచనల పాలన

– బిఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వం
– దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే
– రూ.30వేల కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టింది
– పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపని సీఎం 
– పాలమూరుకు తీవ్ర అన్యాయం
– జడ్చర్ల పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు

మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడుగడుగునా రైతులను మోసం చేస్తూనే ఉందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు పాలమూరు జిల్లా పరువు తీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇవాళ నిర్వహిస్తున్నది ఆశీర్వాద సభ కాదని, అది ముమ్మాటికీ రైతు వంచన సభేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను సభలో ప్రదర్శించిన హరీష్‌ ‌రావు.. సీఎం అనుచిత వ్యాఖ్యల వల్ల ముఖ్యమంత్రి కుర్చీ విలువ కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా, ప్రజలకు ఏం కావాలో ముందే గుర్తించి పనులు చేసేవారని హరీష్‌ ‌రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో రైతాంగానికి ఇచ్చిన బోనస్‌ ‌హా అంతా ఒక బోగస్‌ ‌వ్యవహారంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని, మార్కెట్లలో తరుగు పేరుతో నిరుపేద రైతులను దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు రైతులకు సకాలంలో యూరియా ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. షాపుల్లో అసలు యూరియా స్టాక్‌ ఉం‌చడం లేదు కాబట్టే.. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి యాప్‌ ‌లంటూ కొత్త కథలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై కూడా హరీష్‌ ‌రావు చమత్కరించారు. జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి అసలు ఏం మాట్లాడుతాడో, ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో జిల్లా మంత్రులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్‌ ‌మార్క్ ‌మోసపూరిత పాలనపై రైతాంగం తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హరీష్‌ ‌రావు హెచ్చరించారు.జడ్చర్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో రైతుల ఆశీర్వాద సభ టింగ్‌ ‌పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్‌ ‌కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్‌ ‌రెడ్డికి హితవు పలికారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇస్తామని హానిచ్చిర్రు.. కానీ ఇచ్చిందెంత రూ.12 వేలు.. అవి కూడా ఒక పంట మొత్తానికే 9వేలు ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చాడు. ఇంకో పంట 2 ఎకరాల వరకే ఇచ్చాడు.. వాళ్లిచ్చిన ప్రకారం లెక్క తీస్తే ఇవాళ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతు బంధుపై రూ.29300 కోట్లు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడిందన్నారు హరీష్‌ ‌రావు.  జడ్చర్ల సభ నుంచి అడుగుతున్నా రేవంత్‌ ‌రెడ్డి నువ్వు పెట్టుకున్న ఈ రైతు వంచన సభలో రూ.29300 కోట్లు ఎప్పటిలోపు ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తున్నానన్నారు హరీష్‌ ‌రావు. ఈ బాకీ బడ్డ రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా తిరిగిస్తావో చెప్పలని రైతుల పక్షాన, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పక్షాన నేను రేవంత్‌ ‌రెడ్డిని అడుగుతున్నానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *