జడ్జి మాధవీదేవిపై తప్పుడు ప్రచారం

– ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమారుడికి బెయిల్ ఇస్తే ఆమె భర్తకు చైర్మన్ పదవి ఇస్తారని తప్ప్పుడు ప్రచారం చేశాడు. అసత్య ఆరోపణలు చేసిన వారిపై హైకోర్టు రిజిస్ట్రార్ బి.ఎస్.చిరంజీవి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దామోదర్‌ను అరెస్టు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *