– మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. తనతో కూర్చుని మద్యం సేవించిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. సికింద్రాబాద్‌లోని ఎన్.టి.పి.సి భవనంలోని ఐదవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నర్సింహులు అనే వ్యక్తి, అతని స్నేహితుడు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒక విషయంలో తీవ్రమైన గొడవ మొదలైంది. మద్యం మత్తులో ఉన్న స్నేహితుడు మద్యం సీసాతో నర్సింహులుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో నర్సింహులు ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో కుప్పకూలాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మోండా మార్కెట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



