నలుగురు మహిళల మృతి
ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌పద్రేశ్‌లోని అమ్రోహా జిల్లా రాజబ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్రాసి గ్రామంలో లైసెన్స్ పొందిన బాణసంచా కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తయారీ కేందర్ర భవనం కూలిపోయింది. నలుగురు మహిళలు మృతిచెందారు. ఆరుగురు మహిళలు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు అందరూ స్థానికులే. స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన తొమ్మిదిమంది మహిళలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.