– రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు
– సునామీ హెచ్చరిక జారీ
టోక్యో, ఏప్రిల్ 20: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూ ప్రకంపనల తీవ్రత కారణంగా వందల కిలోటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి. మూడు మీటర్ల అంటే సుమారు 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ సునా హెచ్చరిక జారీ చేసింది. తొలి సునా అలలు వెంటనే ఉత్తర తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ సంస్థ తెలిపింది. సునా అలలు పదేపదే తాకే అవకాశం ఉందని.. హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సంక్షోభ నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




