కేర్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా దుర్గాపూజ, బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 16: కేర్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో దుర్గాపూజ, బతుకమ్మ వేడుకలను శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా నిర్వహించారు. సంస్థ ఉన్నతాధికారులు, వైద్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. దీంతో కార్పొరేట్ కార్యాలయంలో పండుగ సందడి నెలకొంది.

ఈ వేడుకల్లో *ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ఇండియా-2 సీఈవో డాక్టర్ పవన్ కుమార్* , సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ శలభ్ డాంగ్, ఇండియా-2 క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ హెడ్ రాజీవ్ చౌరే, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు ఉద్యోగుల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందించాయి. ఈ సందర్భంగా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *