– ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే
– రైతుల కన్నీరు ముఖ్యమంత్రికి పట్టడంలేదు
– ఎల్‌నినో పేరుతో హాలిడే ప్రకటించి రైతులను శిక్షించిన రేవంత్
– 19నెలల ముందే హెచ్చరించిన శాస్త్రవేత్తలు
– చేతులు కాలాక అధికార్లపై రేవంత్ చిందులు
– రాజకీయ అక్కసుతోనే కన్నెపల్లి మోటార్లు ఆన్చేయలేదు
– దేవాదుల, కల్వకుర్తి మోటార్లను 24గంటలు నడపనందునే సాగునీటి కరువు
– కరువు కాలంలో ప్రజలపై రూ.5420కోట్ల కరెంటు బిల్లు భారం
– ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్ల వానాకాలంలోనే దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉంటే ఈ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడతాయని 10 నెలల క్రితమే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో సాగునీరు, కరెంటు అందక ఎండిపోయిన వరి పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. చేతికొచ్చే దశలో ఎండిపోయిన పొలాలను చూపిన బాధిత రైతులను ఆయన ఓదార్చారు. అనంతరం రైతులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కరువు పరిస్థితులతో ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో పత్తి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక కుదేలయ్యారని, ఎకరాకు పది క్వింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడి నేడు రెండు, మూడు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు రూ. 5,000 విడుదల చేసింది, ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చాయి. కానీ మన ప్రభుత్వం ఇంతవరకు కరువు మండలాలు ప్రకటించలేదు, పైసా సాయం చేయలేదని విమర్శించారు. ఎల్‌నినో హెచ్చరికలు రాగానే ఇతర రాష్ట్రాలు పది నెలల ముందే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు సమకూర్చుకున్నాయి. కానీ రేవంత్ రెడ్డి 9 నెలలపాటు నిద్రపోయి సమీక్షలు చేయకుండా, కోల్ ఇండియాతో మాట్లాడి బొగ్గు తేకుండా ఇప్పుడు రైతులు రోడ్డెక్కి సబ్ స్టేషన్లను ముట్టడిస్తుంటే కొందామన్నా కరెంటు దొరకడం లేదని బీద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికారులను సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి చిందులు వేస్తున్నారన్నారు. సకాలంలో ఆదేశాలు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిని ముందుగా సస్పెండ్ చేయాలన్నారు. సమస్య నెత్తిమీదకు వచ్చాక నిన్న యాదాద్రి ఐదో యూనిట్‌ను సింక్రనైజ్ చేశారు, ఈ పని ముందే చేసి ఉంటే పంటలు ఎండేవి కావు. నాడు కరోనా విపత్తు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలకు రక్షణ కవచంలా నిలబడితే.. నేడు ఎల్‌నినో వస్తే రేవంత్ రెడ్డి ప్రజలను శిక్షిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు నిరంతర కరెంటు, సాగునీరు ఇచ్చి, విశాఖపట్నం పోర్టులో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి యూరియా తెప్పించి, బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో హమాలీలను రప్పించి కేసీఆర్ కోటి టన్నుల పంట పండించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పైసలు పెడితే నీళ్లు దొరుకుతాయా? అంటూ డైలాగులు కొడుతూ ఎల్‌నినో పేరిట క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు.
అరవింద్ రెడ్డి అనే యువ రైతు తన 3 ఎకరాల పొలాన్ని కాపాడుకోవడానికి కరెంటు లేక రోజుకు రూ.4,000 జనరేటర్ కిరాయి, రూ.3,000 డీజిల్ కలిపిమూడు రోజుల్లో రూ. 21,000 ఖర్చు పెట్టాడని, అయినా కరెంటు రాకపోవడంతో పెట్టుబడి తడిసిమోపెడవుతుందని పంటను వదిలేస్తే 2.5 ఎకరాలు ఎండిపోయి అర ఎకరం మాత్రమే మిగిలిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో దుకాణాల్లో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, బావుల దగ్గర ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లు మాయమైపోతే కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు తెచ్చి జనరేటర్లకు గిరాకీ పెంచారని విమర్శించారు. స్వామి అనే రైతు 3 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాల 30 గుంటలు ఎండిపోయి 10 గుంటలే మిగిలింది. దయ్యాల యాదగిరి అనే రైతు 10 ఎకరాలు వేస్తే 9 ఎకరాలకు పైగా ఎండి పోయిందని కన్నీరు పెట్టుకున్నాడు. నరసింహులు అనే రైతు వేసిన ఒక్క ఎకరం పూర్తిగా ఎండిపోయింది.
సత్యనారాయణ అనే మరో రైతు 6 ఎకరాలు నాటేస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. లో-వోల్టేజీ, టూ ఫేజ్ కరెంటు వల్ల స్టార్టర్లలో పత్తులు కొట్టుకుంటూ రెండుసార్లు మోటార్లు, ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రూ. 10 వేల చొప్పున నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాడు కేసీఆర్ హయాంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో ఎంత నాణ్యమైన కరెంటు ఉండేదో, రైతుల బోర్ల దగ్గర కూడా అంతే నాణ్యమైన కరెంటు ఉండేది. బూరుగుపల్లి పరిసరాల్లోనే వందలాది ఎకరాలు పొట్ట దశకు వచ్చి మరో 20 రోజుల్లో కోతకు వచ్చే సమయంలో నీళ్లు లేక కరెంటు లేక నోటికాడి బుక్క మట్టిపాలవుతోంది. కేసీఆర్ హయాంలో యాసంగి, వానాకాలాల్లో బంగారంలా పంటలు పండాయని, వానాకాలంలో నీళ్లు లేకపోవడం ఇదే మొదటిసారని రైతులు వాపోతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపుకోవచ్చని, తమకు సంబంధం లేదని ఎన్ఎస్డీఏ హైకోర్టులో స్పష్టంగా అఫిడవిట్ వేసింది. కానీ కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే కేసీఆర్ కి పేరు వస్తుందని, తమ అబద్ధాలు బయటపడతాయనే రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తకుండా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, మెదక్, రామాయంపేట, భువనగిరి, యాదాద్రి ప్రాంతాల్లో పంటలను ఎండబెడుతున్నారన్నారు. కాళేశ్వరం రెండో టీఎంసీ పనులను మూడేళ్లుగా ఆపేశారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే మల్లన్న సాగర్‌లోకి రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చేవి, హైదరాబాద్ తాగునీటికి, మూసీకి కూడా నీళ్లు అందేవి.దేవాదుల ప్రాజెక్టు వద్ద కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజీలో గోదావరి నీళ్లు అందుబాటులో ఉన్నా 10 మోటార్లకు గాను 7, 8 మోటార్లను మాత్రమే నడుపుతూ 24 గంటలకు బదులు 8 గంటలే నడిపి 16 గంటలు బంద్ పెడుతూ వరంగల్ జిల్లాలో కృత్రిమ కరువు సృష్టించారని ఆరోపించారు.
నీళ్ల కోసం ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన పనిలేదు, కట్కొత్తుతే చాలు రెండు పంటలు పండాలి అని కేసీఆర్ ప్రాజెక్టులు కడితే, ఉన్న నీళ్లను ఎత్తడం కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరులో కల్వకుర్తి కింద శ్రీశైలంలో నీళ్లు ఉన్నా, 24 గంటలు మోటార్లు నడిపి 35 టీఎంసీలు ఎత్తాల్సినచోట కేవలం 8 గంటలే నడిపి 13 టీఎంసీలు మాత్రమే ఎత్తారు.నాడు 30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో 13 వేల ఎకరాలకే నీళ్లిస్తే, కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టి 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. నేడు పాలమూరు కరువుకు ఎల్‌నినో కారణం కాదు, రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యమే కారణం.రేవంత్ రెడ్డి గోదావరిలో, కృష్ణాలో నీళ్లు ఎత్తకుండా వదిలేస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఒడిసిపట్టుకుని నీళ్లను తరలించుకు పోయారు. అందుకే ఏపీలో పంటలు ఎండలేదు, రేవంత్ రెడ్డి వైఫల్యం ఏపీకి వరంగా మారింది. కరోనా కష్టకాలంలో ప్రజలపై భారం పడకూడదని కేసీఆర్ గారు కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచే ప్రతిపాదనలను తిరస్కరించారు. కానీ రేవంత్ రెడ్డి ఈ కరువు కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలపై రూ. 5,420 కోట్ల కరెంటు చార్జీల భారం మోపారు, ఆర్టీసీలో భార్యకు ఫ్రీ అని భర్తకు డబుల్ టికెట్ కొడుతూ చార్జీలు పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. మంచినూనె రూ. 220, పప్పులు రూ. 160, ఉల్లిగడ్డ రూ. 70, ఎల్లిగడ్డ రూ. 200 కి చేరింది. దేశానికే ధాన్యాగారమైన తెలంగాణలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టలేక, గోదాముల్లోని నిల్వలను బయటకు తేలేక బియ్యం ధరను కిలో రూ. 90 కి పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదే.పంటలు ఎండిపోయి పని దొరకక అల్లాడుతున్న దళిత, గిరిజన, బలహీన వర్గాల వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12,000 ఇస్తామని రెండు బడ్జెట్లలో పెట్టి, అసెంబ్లీలో ఆమోదించినా ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ 20-30 రోజుల పాటు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వదిలి, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తే రాష్ట్రంలో మిగిలిన 10 నుంచి 20 లక్షల ఎకరాల పంటనైనా కాపాడుకోవచ్చు.కన్నెపల్లి, దేవాదుల, కల్వకుర్తి మోటార్లను తక్షణమే 24 గంటలూ నడిపించాలి.రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించి, ఎండిపోయిన 12 లక్షల ఎకరాల పంటలకు నష్టపరిహారం అందించాలి. రైతు కూలీలకు వెంటనే రూ. 12,000 విడుదల చేయాలి.తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్లకు నిధులు ఇచ్చి ఎమ్మెల్యేలు, సర్పంచులు, కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలి.ప్రజలపై మోపిన రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని, పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకుని, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.

—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు