ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
– శంషాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం

శంషాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘంటాపథంగా చెప్పారు. శంషాబాద్‌లో గురువారం జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా శ్రేణులు కష్టపడాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ప్రత్యేక ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టాలన్నారు. బూత్ స్థాయి నుంచి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి వివరించాలని, బీఆర్‌ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. పాత, కొత్త నేతలంతా విభేదాలు పక్కనబెట్టి సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *